Breaking News

గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థుల ఆందోళన ఉధృతం

Published on Fri, 08/30/2024 - 15:39

సాక్షి,కృష్ణాజిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్ధులకు ఏబీవీపీ విద్యార్ధి సంఘం, మహిళా సంఘాలు మద్దతిచ్చాయి. మంత్రి కొల్లు రవీంద్ర,కలెక్టర్, జిల్లా ఎస్పీ హామీ ఇచ్చినా విద్యార్దులు వెనక్కి తగ్గలేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ దృష్టికి ఘటనను తీసుకెళతామని విద్యార్థులు తెలిపారు. 

ఎలాంటి విచారణ చేయకుండానే కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఫైర్‌ అయ్యారు. ఘటనపై సాయంత్రంలోగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్‌ చేశారు. కాలేజి బాత్‌రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టిన విద్యార్ధి,అతనికి సహకరించిన విద్యార్ధినిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విచారణ సక్రమంగా జరగకపోతే రెండు రోజుల్లో రాష్ట్ర బంద్‌ చేపడతామని హెచ్చరించారు. 

300 మంది అమ్మాయిల జీవితాలు నాశనం..

వీలైనంత త్వరగా యాక్షన్‌ తీసుకుంటాం: మంత్రి కొల్లు రవీంద్ర

  • గుడ్లవల్లేరు కాలేజీలో విద్యార్ధుల ఆందోళన ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం.

  • హిడెన్ కెమెరాలు పెట్టారన్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్నాం.

  • వీడియోలపై మూడు రోజుల క్రితమే యాజమాన్యానికి తెలిపామని విద్యార్ధినులు చెప్పారు.

  • రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.

  • విచారణకు ఐదుగురు మహిళా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.

  • వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుంటాం విచారణలో ఆరోపణలు నిజమని తేలితే తీవ్రమైన చర్యలు ఉంటాయి.

  • విద్యార్ధుల కెరీర్ కు ఎలాంటి సమస్య రాదు ఇందులో ఉన్నవారు ఎంతటి వారైనా వదిలేది లేదు.

  • కళాశాల యాజమాన్యం విద్యార్ధులను వేధింపులకు గురిచేయకుండా సర్క్యులర్ జారీ చేయిస్తాం. 

విచారణ జరుగుతోంది.. కాలేజీ ప్రిన్సిపల్ కరుణాకర్

  • గురువారం సాయంత్రం విద్యార్ధుల నుంచి నాకు కంప్లైంట్ వచ్చింది. 
  • విద్యార్ధులు చెబుతున్నట్లు వారంరోజుల క్రితం మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
  •  నిన్నటి నుంచి మేం విద్యార్ధులకు అందుబాటులోనే ఉన్నాం.
  •  గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు మా కాలేజీలో చోటచేసుకోలేదు.
  • విద్యార్ధులు చేస్తున్న ఆరోపణల పై విచారణ జరుగుతోంది.
  •  భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటాం.
     

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)