Breaking News

AP: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం.. aకదం తొక్కిన విద్యార్థి లోకం

Published on Thu, 11/07/2024 - 05:47

అనంతపురం అర్బన్‌/తిరుపతి అర్బన్‌/పార్వతీపురం టౌన్‌/­సాక్షి, అమరావతి: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున బుధవారం ఉద్యమించారు. భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ల మందు ర్యాలీ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని, ఇంటర్‌ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, వర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని..ఇలా సమస్యలను ప్రస్తావిస్తూ...వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు.

విద్యార్థులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్‌ చేశారు. అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అ«ధ్యక్షుడు ప్రసన్న ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనం­తరం వారికి నోటీసులిచ్చి పంపించారు. 

విద్యార్థులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వ­ని కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, ఫీజుల కోసం విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఇంటర్‌ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  అలాగే, తిరుపతిలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. డిగ్రీలో మేజర్, మైనర్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉన్నత విద్యను దూరం చేసే జీవో 77ను రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. తల్లికి వందనం కింద రూ.15,000ను ఈ ఏడాది నుంచే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

అనంతరం కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌కు వినతిపత్రాన్ని అందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న విద్యా, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమించాలని కోరుతూ ఆర్టీసీ కాంపెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు.  సమస్యల పరి­ష్కా­రంపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్య­క్షులు కె. ప్రసన్నకుమార్, కార్యదర్శి ఎ.అశోక్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)