Breaking News

బీటెక్‌ విద్యార్థినికి ప్రాణం నిలిపిన సీఎం జగన్‌

Published on Sat, 08/05/2023 - 04:18

కోడుమూరు రూరల్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీటెక్‌ విద్యార్థిని ప్రాణం నిలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన గుర్రం క్రిష్ణయ్య 108లో డ్రైవర్, ఆయన భార్య నాగలక్ష్మమ్మ అంగన్‌వాడీ టీచర్‌. వీరి కుమార్తె జాన్వీకౌసిక్‌ ఒంగోలులోని రైజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. కాలికి గడ్డ ఏర్పడి.. అది క్రమంగా క్యాన్సర్‌గా మారింది. తల్లిదండ్రులు కర్నూలు, తిరుపతి, విజయవాడలో చూపించగా.. వైద్యులు ఆరు నెలలకు మించి ఆమె బతకదని, హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

ఆశతో అక్కడికి వెళ్లగా రూ.7 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేసేందుకు కూడా పరిమితి దాటిందని చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టి చూపించే స్థోమత లేక వెనుదిరిగారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడంతో ఆయన ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతో, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చూశారు. దీంతో విద్యార్థినికి మార్చి నెలలో బసవతారకం ఆస్పత్రిలో ఆపరేషన్‌ జరిగింది.

ఆగస్టులో విద్యార్థిని క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకోనుండటంతో ఆ తల్లిదండ్రుల సంతోషం అంతా ఇంతా కాదు. ఎన్నో ఆస్పత్రులు తిరిగి పాప ప్రాణం దక్కదని ఆశలు వదులుకున్న దశలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ రూపంలో సీఎం జగన్‌ తమ బిడ్డ ప్రాణాలు కాపాడారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌కు రుణపడి ఉంటామని చెబుతున్నారు. జగనన్న వల్లే తాను కోలుకుంటున్నానని విద్యార్థిని జాన్వీకౌసిక్‌ చెప్పింది.  

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)