Breaking News

ఊపిరి తీసిన సెల్‌ఫోన్‌

Published on Thu, 01/01/2026 - 04:37

వినుకొండ: సెల్‌ ఫోన్‌ ధ్యాస ఓ విద్యార్థి ఊపిరి తీసింది. ఫోన్‌ చూసుకుంటూ వుండిపోవడంతో దిగాల్సిన స్టాప్‌ దాటిపోవడంతో కంగారులో కదులుతున్న బస్సు నుంచి దూకిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వినుకొండ రూరల్‌ మండలం విఠంరాజుపల్లి సమీపంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన కన్న వారికి పుత్ర శోకం మిగిల్చింది.వివరాలు... ప్రకాశం జిల్లా పుల్లల చెరువుమండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి(16) గుంటూరు జిల్లా వినుకొండ దరి విష్ణుకుండినగర్‌లో బంధువుల ఇంటి వద్ద ఉండి స్థానిక బాలాజీ ఐటీఐ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. 

రోజూలాగానే కళాశాలకు వెళ్లేందుకు బుధవారం బస్సు ఎక్కిన లక్ష్మీరెడ్డి సెల్‌ఫోన్‌లో లీనమయ్యాడు. దిగాల్సిన బస్టాప్‌ వచ్చిన విషయాన్ని గమనించలేకపోయాడు. స్టాప్‌ దాటి బస్సు వెళ్తుండగా తేరుకుని  డ్రైవర్‌ను బస్సు ఆపాలని కోరాడు. డ్రైవర్‌ బస్సు ఆపే ప్రయత్నం చేస్తుండగానే లక్ష్మీరెడ్డి  బస్సులో నుంచి కిందకు దూకేశాడు. దీంతో నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోవడంతో నడుము, వెన్నెముక భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. 

స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మీరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. కొంతసేపటికి విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రయాణ సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, పెద్దలు సూచిస్తున్నారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)