Breaking News

కుట్టేస్తారు.. మిషన్లు ఇవ్వండి!

Published on Sat, 08/16/2025 - 04:52

సాక్షి, అమరావతి: కుట్టుశిక్షణ ఇచ్చేశాం.. ముందు మిషన్లు ఇవ్వండి.. వివరాలు తరువాత.. అంటూ ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో రూ.కోట్లు కొట్టేసేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏదోరకంగా నిధులు విడుదల చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు ఒకటి, రెండు రకాలుగా ప్రయత్నించినా పనికాకపోవడంతో తాజాగా ఎమ్మెల్యేల లేఖలతో రంగంలోకి దిగారు. బీసీ సంక్షేమశాఖలో రూ.257 కోట్ల తో 1,02,832 మందికిపైగా మహిళలకు ఉచితంగా కుట్టుశిక్షణ ఇచ్చి మిషన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిన స్కీమ్‌లో రోజుకో వింతపోకడ వెలుగులోకి వస్తోంది. 

బీసీ, ఈడబ్ల్యూఎస్‌ మహిళలకోసం అంటూ చేపట్టిన ఈ పథకానికి ఆదిలోనే అక్రమాల చెదలు పట్టిన సంగతి తెలిసిందే. కీలకనేతల అండదండలతో టెండర్‌ నుంచి శిక్షణ వరకు అనేక నిబంధనలకు పాతరేయడంతో ఈ స్కీమ్‌లో వేలు పెడితే భవిష్యత్‌లో చట్టపరంగా ఇబ్బందులు తప్పవని అధికారులు హడలిపోతున్నారు. దీనికితోడు జాతీయ­స్థాయిలో అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ (పీఎం విశ్వకర్మ) స్వయం ఉపాధి శిక్షణ కార్య్ర­కమాల్లో కుట్టుశిక్షణను పరిగణనలోకి తీసుకోకపోయినా.. రాష్ట్రంలో ఈ తరహా శిక్షణ చేపట్టడా­న్ని అధికారులు తప్పుబడుతున్నారు. 

ఈ పథకానికి బిల్లులు మంజూరు చేసి తాము దోషులుగా నిల­బడలేమంటూ ఫైనాన్స్‌ అధికారులు కొర్రీవేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఈ పథకంపై వస్తున్న విమర్శలను రాజకీయాలకు ముడిపెట్టి ప్రభుత్వ పెద్దలను తమకు అనుకూలంగా మలుచుకుని స్కీమ్‌కు సంబంధించిన బిల్లులు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

ఎంతమందికి, ఎక్కడ శిక్షణ ఇచ్చారో తెలియదు..  
కొందరు కీలక బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారుల (ఈడీల)తో సమావేశం నిర్వహించి ఉచిత శిక్షణ మొదటిదశ పూర్తయినట్టు ఆమోదం తెలపాలని ఒత్తిడి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో దరఖాస్తులు తీసుకుని, నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇచ్చినట్టు ప్రకటించి ఇప్పుడు తమను బాధ్యుల్ని చేస్తున్నారంటూ ఈడీలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గంలో మొదటిదశ శిక్షణ పూర్తిచేసినట్టు కాంట్రాక్టర్‌ మనుషులు, ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేల లేఖలు తీసుకుంటున్నారు. 

శిక్షణ ఎక్కడ ఎంతమందికి ఇచ్చారో.. ఎవరికీ తెలియని పరిస్థితిలో మొదటిదశ పూర్తయిందంటూ ఎమ్మెల్యేల లేఖ తీసుకుని, దాన్ని సిఫారసు లేఖగా ప్రయోగించి ఫైనాన్స్‌ అధికారులపై బిల్లుల కోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్‌ కాంట్రాక్టులు ఇచి్చనా, శిక్షణ ఇచ్చేవారికి నైపుణ్య అర్హతలు లేకపోయినా, అరకొరగానే శిక్షణ అయిందనిపించినా, కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల నిఘాలో ఉన్న వారికి టెండరు ఖరారు చేసినా.. పట్టించుకోని కీలకనేతలు తాము అనుకున్నదే జరగాలనే పట్టుదలతో ఎమ్మెల్యేలను రంగంలోకి దించుతుండటం విమర్శనీయంగా మారింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)