Breaking News

ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

Published on Fri, 05/10/2024 - 05:42

అమరావతి: పోలింగ్‌ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. ఆయన గురువారం డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాతో కలిసి వెలగపూడిలోని సచివాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో పోలింగ్‌కు 72 గంటల ముందు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖేశ్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ రానున్న మూడురోజులు అత్యంత కీలకమైనవని చెప్పారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. 

ఓటర్లను ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించాలని చెప్పారు. షాడో ఏరియాలో పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన హెలికాప్టర్లను సద్వినియోగం చేసుకుని పోలింగ్‌ శాతం పెరిగేలా చూడాలని కోరారు. ఓటర్లందరికీ స్లిప్పులు అందేలా చూడాలన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలను జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు.

పోలింగ్‌ రోజున ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా షామియాలు వేయడంతోపాటు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా మాట్లాడుతూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకుని పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెలంగాణ సరిహద్దుల్లోని జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్‌ రోజున వాహనాలు, వ్యక్తుల రాకపోకలపై దృష్టి సారించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఎస్పీ బెటాలియన్‌ అదనపు డీజీ అతుల్‌సింగ్, రాష్ట్ర పోలీస్‌ నోడల్‌ అధికారి, అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ, అదనపు ఈసీవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)