Breaking News

బాల్య వివాహాల భారతం

Published on Fri, 03/14/2025 - 05:35

కట్టడి సరే.. ఏటా మరింత పెరుగుదల ఆధునిక సమాజంగా చెప్పుకుంటున్నప్పటికీ, దేశంలో బాల్య  వివాహాల పూర్తి స్థాయి కట్టడి జరగడంలేదు. పైగా ఏడాదికేడాది  ఈ సంఖ్య పెరుగుతుండడం మరో ఆసక్తికర అంశం. అధికారికంగానే లెక్కలు వందల్లో ఉన్నాయంటే, అనధికారికంగా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో  అర్థం చేసుకోవచ్చు. రాజ్యసభలో తాజాగా కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.   – సాక్షి, అమరావతి

మంత్రిత్వశాఖ పేర్కొన్నఅంశాల్లో ముఖ్యమైనవి
బాల్య వివాహాలు అరికట్టేందుకు, వీటితో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా బాల్య వివాహాల నిషేధ చట్టంలోని సెక్షన్‌లో సవరణలు తీసుకుని రావడం జరిగింది.  ఈ సవరణతో రాష్ట్ర ప్రభుత్వాలకు బాల్య వివాహాల నిషేధం అమలు వ్యవహారాల అధికారులను నియమించుకునే అధికారాన్ని కల్పించారు.  బాల్య వివాహాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధ­నలను ఉల్లంఘించే వ్యక్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకునే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు.  

బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని, అటువంటి వారికి సహకరించడం వంటి చర్యలు చేయవద్దని స్థానిక నివాసితులకు తెలియజేయడంతో పాటు బాల్య వివాహాల వల్ల ఉత్పన్నమయ్యే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడం,  బాల్య వివాహాల సమస్యపై సమాజాన్ని చైతన్యవంతం చేయడం అధికారుల విధులు. 

ఈ అధికారులందరూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రత్యక్ష నియంత్రణలో పనిచేస్తారు.  బాల్య వివాహాలను నిరుత్సాహపరచడంతో పాటు లింగ సమానత్వం కోసం బేటీ బచావోృ బేటీ పఢావో పథకాన్ని ‘మిషన్‌ శక్తి’ పేరుతో కేంద్ర అమలు చేస్తోంది. బాల్య వివాహాల నిరోధించేందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది.   

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)