Breaking News

నకిలీ ధ్రువ పత్రాల నియంత్రణకు పటిష్ట చర్యలు

Published on Wed, 03/13/2024 - 05:22

సాక్షి, అమరావతి:  జనన, మరణ నమోదు (సవరణ చట్టం–2023)పై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్‌.జవహర్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరిగే జనన, మరణ రిజిస్ట్రేన్ల ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. నకిలీ పత్రాలను నియంత్రించేందుకు పాత రికార్డులను డిజిటలైజేషన్‌ చేయాలన్నారు.

ఈ చట్టానికి సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలు, మార్గదర్శకాల నోటిఫికేషన్‌ వచ్చేలోగా క్షేత్రస్థాయి అధికారులందరికీ ఈ చట్టంపై పూర్తి అవగాహన కోసం తగిన సమాచారాన్ని అందించాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. జననాలతో పాటు మరణాలు కూడా గ్రామ, మున్సిపాలిటీల స్థాయిలోను ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల సహా ప్రతి చోటా సకాలంలో సక్రమంగా రిజిస్టర్‌ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రల ద్వారా జనన, మరణ రిజిస్ట్రేన్ల నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ నూతన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశానికి, డ్రైవింగ్‌ లైసె­న్సు, ఓటరు జాబితా సవరణ, వివాహ రిజిస్ట్రేషన్, పాస్‌పోర్టు జారీ, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తప్పనిసరని తెలిపారు.

ఇంకా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్‌ అభిషేక్‌ గౌడ, న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Videos

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)