Breaking News

ఆ తల్లికి 21 మంది పిల్లలంట!!!

Published on Mon, 06/16/2025 - 03:55

పుట్టపర్తి అర్బన్‌: ఆమె వయసు 35 ఏళ్లలోపే. కానీ 21 మంది పిల్లలు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. నిజమనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది తల్లికి వందనం జాబితాలో చోటుచేసుకున్న వైచిత్రి. ఇంతకీ ఏం జరిగిందంటే... తల్లికి వందనం పథకంలో రోజుకో విచిత్రం వెలుగు చూస్తోంది. వివరాల నమోదులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా 21 మంది పిల్లలకు ఒకరే తల్లిగా సూచిస్తూ జాబితాలో ప్రదర్శించిన వైనం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి సచివాలయం–1 పరిధిలో చోటుచేసుకుంది. 

పెడపల్లి సచివాలయం–1లో తల్లికి వందనం పథకం కింద అర్హుల జాబితాను ఈ నెల 13న ప్రదర్శించారు. 458 మంది పిల్లలకు రూ.13వేలు చొప్పున జమ చేస్తున్నట్టుగా 15 పేజీలతో కూడిన జాబితా ప్రదర్శించారు. ఇందు­లో భావన అనే మహిళ పేరు, ఆధార్‌ నంబరును 21 మంది విద్యార్థులకు తల్లిగా సూచించారు. దీంతో జాబితాను చూసినవారంతా అవాక్కవుతున్నారు. 

వాస్తవానికి ఆమెకు తొమ్మిది, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 19 మంది పిల్లలు ఇతరులకు చెందినవారు. వారికి ఈమెను తల్లిని చేసేశారు. ఇది ఎలా జరిగిందో.. ఎవరి నిర్లక్ష్యం వల్ల తప్పుగా నమోదు చేశారో తెలియదు కానీ.. జాబితా చూసిన వారంతా నవ్వుకుంటున్నారు.  

35 ఏళ్ల ఆమెకు 21 మంది పిల్లలా?  
భావనకు ప్రస్తుత వయసు 35 ఏళ్లలోపే. కాగా ఆమెకు పిల్లలు 21 మంది ఎలా ఉంటారు? కనీస అవగాహన లేదా? అని అధికార యంత్రాంగంపై స్థానికులు మండిపడుతున్నారు. రెండో శనివారం, ఆదివారం కావడంతో సచివాలయం, పాఠశాలల తలుపులు తెరవలేదు. ఎవరిని అడగాలో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)