Breaking News

మోడల్‌ పేపరే.. సెమిస్టర్‌ ప్రశ్నపత్రం!

Published on Sat, 11/16/2024 - 05:33

చిత్తూరు కలెక్టరేట్‌: చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి అటానమస్‌ హోదా కలిగిన స్థానిక పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలను అధికారులు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలో ఐదు రోజుల క్రితం సెమిస్టర్‌–3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీన రెండవ సంవత్సరం బీఎస్సీకి సంబంధించి ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ యూజింగ్‌ జావా (టైటిల్‌ ఆఫ్‌ ది కోర్స్‌), బీ.కాం రెండవ సంవత్సరానికి సంబంధించి ఈ–కామర్స్, వెబ్‌ డిజైనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. 

ఒక్కొక్క పరీక్ష 75 మార్కులకు జరిపారు. అటానమస్‌ నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రాలు చేరొకచోట రూపొందించాల్సి ఉంది. అయితే, ఆ రెండు పరీక్షలకు ముందు విద్యార్థుల ప్రిపరేషన్‌ కోసం ఇచ్చిన బీవోఎస్‌ (బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌) ప్రశ్నపత్రాలనే సెమిస్టర్‌–3 పరీక్షలకు కూడా ఇచ్చారు. 

ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ హోదా అధికారి అలసత్వం కారణంగానే ఈ తప్పిదం జరిగిందని సమాచారం. పర్యవేక్షించాల్సిన ప్రిన్సిపల్‌ సైతం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా, ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ జీవనజ్యోతిని ‘సాక్షి’ వివరణ కోరగా ప్రశ్నపత్రాలు తమ కళాశాలలో ముద్రించడం లేదని తెలిపారు. ఏదైనా పొరపాటు జరిగిందేమో విచారణ చేస్తామని వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)