Breaking News

వింత కేసు: పుంజు పెట్ట వద్దకు వెళ్లిందని గొడవ!

Published on Mon, 06/15/2026 - 11:06

కాకినాడ: ఇదో కోళ్ల పంచాయితీ.. ఒక సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పెట్ట వద్దకు మరో సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పుంజు వచ్చిందంట. అందుకు మండిపడిన కోడి పెట్ట యజమాని పుంజు కాలిపై గాయపరిచాడనేది పుంజు యజమాని ఆవేదన. తన పుంజును ఎందుకు కొట్టావని ప్రశి్నస్తే.. అతని కుటుంబ సభ్యులంతా కలసి అకారణంగా దూషించారట. 

దీంతో పుంజు యజమాని.. పెట్ట కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వెలువలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెలువలపల్లి గ్రామంలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు పక్క పక్క ఇళ్లలో నివాసముంటున్నారు. రెండు రోజుల క్రితం ఒకరికి చెందిన పుంజు, మరొకరికి చెందిన పెట్ట వద్దకు ప్రకృతి సిద్ధంగా వెళ్లింది. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది. మరి ఈ పంచాయితీని పోలీసులు ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాలి. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)