విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి

Published on Fri, 11/08/2024 - 04:30

సాక్షి, అమరావతి :  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్రలను ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో న్యూ డెమోక్రసీ నాయకుడు పి. ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన వామపక్ష పార్టీల సమావేశం పలు అంశాలను చర్చించి తీర్మానాలు చేసింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు  రకరకాల కుట్రలు చేస్తోందని, ప్రైవేటీకరణను ఆపుతామని ప్రకటించిన తెలుగుదేశం, జనసేన నేతల్లో చిత్తశుద్ధి లోపించిందని తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవటంలో సీఎం చంద్రబాబు విఫలమవుతున్నారని నేతలు మండిపడ్డారు.   

యురేనియం తవ్వకాలూ నిలిపివేయాలి.. 
ఇక కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ప్రాంత గ్రామాల్లో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని, ఆ తవ్వకాలను నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటించాలని కూడా వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. రాష్ట్రంలో కృష్ణానది, బుడమేరు, గోదావరి తదితర నదుల వరదలతో నష్టపోయిన బాధితులందరికీ ఇంకా పూర్తిగా సహాయం అందలేదని, ప్రభుత్వ హామీ ప్రకారం ప్రతి ఒక్క వరద బాధితుడికి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ సమావేశంలో వి. శ్రీనివాసరావు, సీహెచ్‌ బాబురావు (సీపీఎం), కె.రామకృష్ణ, జల్లి విల్సన్‌ (సీపీఐ) తదితరులు పాల్గొన్నారు.

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)