ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఏది?

Published on Tue, 09/09/2025 - 05:00

సాక్షి, అమరావతి: దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న  గౌరవ వేతనం బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఇమామ్, మౌజన్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించి  జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. ముస్లింలకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం,  కనీసం ఇమామ్, మౌజన్లకు సైతం గౌరవ వేతనం అందించడంలోను నిర్లక్ష్యం వహిస్తోంది. 

దీంతో ఇమామ్, మౌజన్లకు అండగా వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం రంగంలోకి దిగింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం బకాయిలు విడుదల చేయించేలా నిరసనకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఇమామ్, మౌజన్లు  సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్‌ల వద్ద శాంతియుత నిరసనలు తెలిపారు. జిల్లాల కలెక్టర్లకు గ్రీవెన్స్‌ సెల్‌లో  వినతిపత్రాలు సమర్పించారు.  

జగన్‌ హయాంలో బకాయిల మాటే లేదు.. 
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతేడాది మార్చి వరకు (ఎన్నికల కోడ్‌ వచ్చే వరకూ) ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు గౌరవ వేతనాన్ని బకాయిలు లేకుండా అందించింది. ఆ తర్వాత కోడ్‌ అమలులోకి రావడంతో ఏప్రిల్, మే, జూన్‌ మూడు నెలల గౌరవ వేతనం పెండింగ్‌లో ఉండిపోయింది. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇమామ్, మౌజన్లకు ఆలస్యంగా ఆరు నెలలకు మాత్రమే గౌరవ వేతనం విడుదల చేసి సరిపెట్టింది.

వాస్తవానికి గతేడాది ఏప్రిల్‌నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 17 నెలల కాలానికి గౌరవ వేతనం బకాయిలను కూటమి ప్రభుత్వం అందించాల్సి ఉంది.  కేవలం ఆరు నెలలకు మాత్రమే ఇవ్వడంతో ఇంకా 11 నెలల బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. దీంతో మసీదులను నిర్వహించడం ఇబ్బందికరంగా మారిందని ఇమామ్, మౌజన్లు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని  కోరుతున్నారు.

ముస్లింలకు హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి 
రాష్ట్రంలో ముస్లింలకు కూటమి ఇచ్చిన 12కుపైగా హామీలలో ఒక్కటి కూడా  అమలు చేయలేదు. ఈ దిశలో కనీస చర్యలు లేవు.  ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కూటమి హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో మైనారిటీ సంక్షేమం కోసం కేటాయించిన నిధుల వ్యయాలను శ్వేతపత్రంలో వివరించాలి. కనీసం ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది.   – బీఎస్‌ గౌస్‌ లాజమ్, ఏపీ హజ్‌ కమిటీ మాజీ చైర్మన్‌  

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)