Breaking News

టమాటా ఉత్పత్తిలో రాష్ట్రానికి మూడో స్థానం 

Published on Wed, 08/23/2023 - 03:36

సాక్షి, అమరావతి: దేశంలో టమాటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2022–23లో 23.37 లక్షల మెట్రిక్‌ టన్నుల టమాటాలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో దేశం మొత్తం టమాటా ఉత్పత్తిలో రాష్ట్రం వాటా 11.30 శాతంగా నమోదైంది. ఈ మేరకు ఇటీవల టమాటా ధరల పెరుగుదలకు కారణాలు, సమస్యలపై నాబార్డు మంగళవారం నివేదికను విడుదల చేసింది.

ప్రధానంగా దేశంలో టమాటాలు ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో 2022–23లో ఉత్పత్తి భారీగా తగ్గిందని నివేదిక తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోలి్చతే 2022–23లో 1.50 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది.   

ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడమే కారణం.. 
ప్రధానంగా టమాల ధరల పెరుగుదలకు గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో ఉత్ప­త్తి గణనీయంగా తగ్గడమేనని నా­బా­ర్డు తెలిపింది. దీంతో పాటు మేలో అకాల వర్షాలు, జూన్‌లో వర్షాలు, వడగండ్ల వానలకు పంట దెబ్బతిందని వివరించింది. కర్ణాటకలో పంట ప్రధాన ప్రాంతాల్లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వడగళ్ల వానలకు, జూన్‌లో భారీ వర్షాలకు.. వేసిన పంటలో 70 శాతం నాశనమైందని పేర్కొంది.

అలాగే మహారాష్ట్రలో ఈ ఏడాది వాతావరణ అననుకూల పరిస్థితులు ఉండటంతో పెద్ద ఎత్తున పంట దెబ్బతిందని వెల్లడించింది. దేశంలో టమాటా ఉత్పత్తి 2021–22లో 206.9 లక్షల టన్నులు ఉండగా ఇది 2022–23లో 206.2 లక్షల టన్నులకు తగ్గిందని తెలిపింది. దీంతో ఈ ఏడాది జూలైలో దేశంలో టమాటా ధరలు మూడు రెట్లు పెరిగాయని వివరించింది.

ఈ ఏడాది జూన్‌లో కిలో టమాటా దాదాపు రూ.30 ఉండగా జూలై చివరి నాటికి రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.130కి పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 10న హోల్‌సేల్‌లో కిలో రూ.106.91 ఉండగా రిటైల్‌ మార్కెట్‌లో రూ.131.69 ఉందని వెల్లడించింది. 

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)