Breaking News

AP: కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణాల్లో ఏపీ ఐదో స్థానం

Published on Sat, 02/17/2024 - 05:02

సాక్షి, అమరావతి: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల (కెసీసీ) ద్వారా రైతులకు స్వల్పకాలిక రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. వ్యవసాయ రంగానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటం, మద్దతు ధర కల్పిస్తుండటంతో రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులు పంటలు సాగు చేస్తున్నారు. దీంతో కేసీసీ ద్వారా స్వల్పకాలిక రుణాలు తీసుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు.

ఈ రుణాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని నాబార్డు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నివేదికలు వెల్లడించాయి.  ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నట్లు నాబార్డు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 45.52 లక్షల రైతులకు ఈ కార్డులు మంజూరు చేశారు. ఈ రైతుల్లో చాలా మందికి కేసీపీ కవరేజ్‌ అయిందని ఎస్‌ఎల్‌బీసీ నివేదిక పేర్కొంది.

పశు సంవర్ధక, డెయిరీ, మత్స్య కార్యకలాపాల రైతులకు అవసరమైన వర్కింగ్‌ కేపిటల్‌ కోసం కేసీసీలను సంతృప్త స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎస్‌ఎల్‌బీసీ పేర్కొంది. ఈ రైతులకు కేసీసీల మంజూరుకు మార్చి నెలాఖరు వరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ శిబిరాల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అక్కడికక్కడే పరిశీలిస్తారని తెలిపింది.  అర్హులైన వారికి  కేసీసీ జారీ చేస్తారంది.

ఈ శిబిరాల ద్వారా ఇప్పటివరకు పశు సంవర్ధక, డైరీ కార్యకలాపాలకు కేసీసీ కోసం 82,366 ధరఖాస్తులు రాగా 68,948 దరఖాస్తులకు కేసీసీ మంజూరు చేశారు. మత్స్య కార్యకలాపాల కోసం 36,076 దరఖాస్తులు రాగా 22,856 మందికి కేసీసీ మంజూరు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పశుసంవర్ధక రంగంలో 95,445 ఖాతాలకు రూ.1079.26 కోట్లు, మత్స్య రంగంలో 5,112 ఖాతాలకు రూ.285.95 కోట్లు మంజూరు చేశారు. అయితే సంతృప్త స్థాయిలో కేసీసీల మంజూరుకు బ్యాంకులు మరింతగా దృష్టి సారించాలని ఎస్‌ఎల్‌బీసీ సూచించింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)