సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత తగదు

Published on Fri, 07/11/2025 - 05:54

సాక్షి, అమరావతి: ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని కేబుల్‌ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో గురువారం రాష్ట్రస్థాయి ఎంఎస్‌ఓ–లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లు (ఎల్‌సీవో) అత్యవసర రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్స్‌ ఫెడరేషన్, ఏపీ మల్టీ సర్వీసెస్‌ కేబుల్‌ ఆపరేటర్ల వెల్ఫేర్‌ అసోసియేషన్, ఏపీ కేబుల్‌ ఆపరేటర్స్‌ జేఏసీ తరఫున రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. 

ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిళ్లతో పాటు తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.  త్వరలోనే విజయవాడలో భారీ నిరసన చేప­ట్టాలని సమావేశం నిర్ణయించింది.   అనంతరం గాందీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. ఎవరేమన్నారంటే.. 

» సాక్షి టీవీ ఆపేయడం వల్ల కస్టమర్లు డీటీహెచ్‌లకు వెళ్లిపోతున్నారని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మల్టీ సర్వీసెస్‌ కేబుల్‌ ఆపరేటర్ల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ టు ఎయిర్‌ ఛానళ్లను ప్రభుత్వానికి సంబంధం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.  
»  పే ఛానళ్ల వ్యవస్థ, ప్రభుత్వం తమకు సహకరించకపోగా ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కేబుల్‌ ఆపరేటర్స్‌ జేఏసీ అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్‌  ఆవేదన వ్యక్తం చేశారు.  
»  ఏపీలో పే ఛానళ్ల రేట్ల పెంపుదలతో కేబుల్‌ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కృష్ణ తెలిపారు. ట్రాయ్‌లో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకుని తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాడ్‌ కాస్టర్ల వ్యవస్థ ఎంఎస్‌ఓలను సైతం బ్లాక్‌ మెయిల్‌ చేసి తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. బ్రాడ్‌ కాస్టర్లు దిగిరాకపోతే పే ఛానళ్లను అవసరమైతే నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.   

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)