Breaking News

మూడేళ్లలో రూ.87,877 కోట్లు

Published on Fri, 12/22/2023 - 05:05

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంపద పెరుగుతోంది. సంపాదనను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నట్లు ఇటీవల జరిగిన 224వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో రూ.87,877 కోట్ల మేర బ్యాంకుల్లో డిపాజిట్లు పెరి­గాయి. 2021 మార్చి నాటికి బ్యాంకుల్లో రూ.3.85 లక్షల కోట్లు డిపాజిట్లు ఉండగా ఈ ఏడాది జూన్‌ నాటికి రూ.4.73 లక్షల కోట్లకు పెరిగాయి. 

పెరిగిన జీవన ప్రమాణాలు..
వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వర్గాల జీవనోపాధి అవకాశాలు, ఆదాయాలు పెరిగేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో మదుపు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాలతోపాటు జగనన్న పాల వెల్లువ ద్వారా ఆదాయ మార్గాలను చూపిస్తూ జీవన ప్రమాణాలను పెంపొందించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.

మహిళలు సాధికారతతో తమ కాళ్లపై నిలబడేలా వివిధ వ్యాపార మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. ఈ కార్యక్రమాలతో 2021 మార్చి నుంచి ఏటా బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో విశాఖలో అత్యధికంగా డిపాజిట్లు ఉండగా నూతన జిల్లాల్లో అత్యధిక డిపాజిట్లు ఎన్టీఆర్‌ జిల్లాలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా డిపాజిట్లున్నాయి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)