Breaking News

అన్నదాతల్లో ఆనందం

Published on Wed, 03/27/2024 - 05:49

సాక్షి, అమరావతి: ఎంతో శ్రమించి పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజులోనే చెల్లింపులు జరపడంతో అన్నదాతల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మంగళవారం రూ.815 కోట్లు చెల్లించింది. దీంతో ఖరీఫ్‌లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లు చెల్లించినట్లయ్యింది.

సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన మిగిలిన స్వల్ప మొత్తాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ డీఎం అనుమతి రాగానే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం షెడ్యూల్‌ చేసింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దళారులు, మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను రక్షిస్తూ ఆర్బీకే స్థాయిలోనే సంపూర్ణ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేస్తోంది.

ఖరీఫ్‌ సీజన్‌లో 29.93 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. 4.96 లక్షల మంది రైతులకు మద్దతు ధరను అందించింది. ఇలా ఈ ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తోంది.

పెరిగిన ధాన్యం సేకరణ..
గత చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏడాదికి సగటున 56 లక్షల టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. అదే సగటు ప్రస్తుత ప్రభుత్వంలో 77 లక్షల టన్నులుగా ఉంది. దీనికి తోడు ఆర్బీకే పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారి కల్లాల వద్దనే ధాన్యం సేకరణ చేపట్టింది. ఆర్బీకేల్లో.. ధాన్యం సేకరణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు చేసింది.

టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్‌ ప్రభుత్వంలో అదనంగా దాదాపు 20 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధర దక్కింది. 

తడిచిన ధాన్యమూ కొనుగోలు..
అలాగే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జయ రకం(బొండాలు/దుడ్డు బియ్యం) ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జయ రకం పండించే రైతులు చాలా లాభపడ్డారు. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని తెచ్చిన రైతులకు సైతం అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంది.

కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కనపెట్టి తడిచిన ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించి మరీ రైతులకు మద్దతు ధర అందించడంలో రికార్డు నెలకొల్పింది. ఆఫ్‌లైన్‌లో సేకరించిన ధాన్యాన్ని దూరాభారాలు చూడకుండా డ్రయ్యర్‌ సౌకర్యం, డ్రయ్యర్‌ ప్లాట్‌ఫాం ఉన్న మిల్లులకు తరలించి ఆరబోసి మరీ కొనుగోలు చేసింది. జగన్‌ ప్రభుత్వం అదనపు భారాన్నైనా మోసింది గానీ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు చేపట్టింది.

బాబు హయాంలో బకాయిలు..
చంద్రబాబు హయాంలో రైతులు ధాన్యం డబ్బుల కోసం అహోరాత్రులు ఎదురు చూడాల్సి వచ్చేది. రైతులు తాము కష్టపడి పండించిన పంటను ప్రభుత్వంపై నమ్మకంతో విక్రయిస్తే.. వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చంద్రబాబు పక్కదారి పట్టించారు.

ఇలా 2019 ఎన్నికలకు ముందు పౌరసరఫరాల సంస్థకు చెందిన రూ.4,838.03 కోట్లను వేరే కార్యక్రమాలకు మళ్లించి రైతులను నట్టేట ముంచారు. చివరకు సీఎం పదవి నుంచి దిగిపోతూ రూ.960 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేశారు. సీఎం జగన్‌ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలోని బకాయిలను కూడా తీర్చి.. పారదర్శక ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారు.

అదనంగా టన్నుకు రూ.2,523
గత ప్రభుత్వం పేరుకే ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. వారంతా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీ­ల బస్తాకు మద్దతు ధర కంటే రూ.­200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది.

దీంతో మిల్లర్లు, దళారుల దందాకు చెక్‌పడింది. అలాగే రైతులపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రతి టన్ను ధాన్యం కొనుగోలులో రవాణా, హమాలీ, గోనె సంచుల వి­ని­యోగం నిమిత్తం రైతులకు రూ.2,523 అందిస్తోంది. గతంలో రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే.. వాటి­ని ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్టు రికార్డుల్లో నమోదు చేసి టీడీపీ నాయకులే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)