రైతన్నకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

Published on Wed, 05/17/2023 - 03:20

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతన్న­ల­కు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, డీబీటీ పథ­కాలు ఎంతో బాగున్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహా­య­మంత్రి భగవత్‌ కిషన్‌రావు కారద్‌ ప్రశంసించా­రు. రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుందని, డీబీటీతో రైతులకు మేలు జరుగుతుందన్నా­రు. మంగళవారం విశాఖలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆయన మా­ట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పథకాల అమలుకు బ్యాంకర్లు విధిగా సహకరించాలని సూచించారు.

ఏపీలో ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో బ్యాంకర్ల సేవ­లు మెరుగ్గా ఉన్నాయని, ఎస్‌ఎల్‌బీసీ లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేయడం అభినందనీయ­మన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సేవలను విస్తృతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు మరింత విస్తరించాలని సూచించారు. ప్రైవేట్‌ బ్యాంకులు తీరు మార్చుకుని సేవలను మెరుగు పరచు­కోవా­లన్నారు.

‘ముద్ర’ రుణాల మంజూరులో క­రూర్‌ వైశ్యా బ్యాంకు బాగా వెనకబడిందని, మూడు నెలల్లో తీరు మార్చుకోవాలని ఉన్నతా­ధికారులకు స్పష్టం చేశారు. ఎక్కువ మంది మహిళలకు రుణాలివ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న తోడు’ పథకం గురించి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఆరా తీశారు. 

కౌలు రైతులకు బ్యాంకులు సహకారం అందించాలి..
ప్రైవేట్‌ బ్యాంకులు ఆశించిన స్థాయిలో రుణాలి­వ్వడం లేదని, కౌలు రైతులకు కొన్ని బ్యాంకుల నుంచి తగిన సహకారం అందడం లేదని ఉప­ముఖ్య­మంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి బూడి ము­త్యా­­­లనాయుడు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పా­రిశ్రా­మికవేత్తలకిస్తున్న రుణాలు, టిడ్కో ఇళ్ల రుణ పరి­మితిని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యవసా­యం, అనుబంధ రంగానికి అధిక ప్రాధాన్య­మి­స్తున్నా­రని వ్యవసా­యశాఖ మంత్రి కాకాణి గో­వర్థన్‌రెడ్డి చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్లు మరింత సహ­కరించాలని కోరా­రు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రం లో సక్రమంగా అమలవు­తు­న్నాయని రాష్ట్ర ఆర్థి­కశాఖ ప్రత్యేక ప్రధా­నకా­ర్యదర్శి రావత్‌ తెలిపా­రు. సమావేశంలో ఎ­స్‌­ఎల్‌బీసీ కన్వీనర్‌ నవనీత్‌­కుమార్, ఆర్బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ (ఏపీ) ఓఏ బషీర్, నాబార్డు సీజీఎం ఎం­ఆర్‌ గోపాల్, యూనియన్‌ బ్యాంక్‌ సీజీఎం మహాపాత్ర, ఎస్‌ఎల్‌బీసీ కోఆర్డినేటర్‌ రాజబాబు తదితరులు  పాల్గొన్నారు. 

Videos

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)