Breaking News

ఇలా ‘సెలవిచ్చారు’

Published on Fri, 12/05/2025 - 05:36

సాక్షి, అమరావతి: 2026 క్యాలెండర్‌ ఇయర్‌లో సాధారణ సెలవులు, ఆప్షనల్‌ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మొత్తం 24 సెలవు దినాలు ప్రకటించింది. ఇందులో నాలుగు సెలవులు మహాశివరాత్రి, బాబూ జగ్జీవన్‌రాం జయంతి, దుర్గాష్టమి, దీపావళిలు ఆదివారం రావడంతో నికరంగా 20 సెలవులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు లభించనున్నాయి. కానీ ఈసారి అత్యధిక సెలవులు శుక్రవారం రావడంతో మధ్యలో శనివారం లీవ్‌ పెట్టుకుంటే వారాంతాల్లో మూడు రోజులు ఆటవిడుపు కలగనుంది. 

పై అధికారికి ముందస్తు సమాచారంతో గరిష్టంగా ఐదు సెలవుదినాలను వినియోగించుకునేలా 21 ఆప్షనల్‌ హాలిడేలను ప్రకటించింది. ఇందులో రెండు ఈద్‌ ఈ గదర్, మహాలయ అమావాస్య ఆదివారంతో కలిసిపోయాయి.  బ్యాంకులు వంటి ఇతర వ్యాపార సంస్థలకు నెగోషబుల్‌ ఇనిస్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ 1981 ద్వారా 21 సాధారణ సెలవులను ప్రకటించింది. 

చంద్ర దర్శనాన్ని బట్టి నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్‌ మిలాద్‌ ఉన్‌నబీతో పాటు హిందూ పర్వదినాల్లో ఏమైనా మార్పులు ఉంటే వాటిని ప్రసార మాధ్యమాల ద్వారా ముందుగానే తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)