వినుకొండ బస్టాండ్‌లో తొక్కిసలాట

Published on Tue, 01/20/2026 - 04:56

వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ డిపోలో సోమవారం బస్సు ఎక్కేందుకు ఒకేసారి వందలాది మంది ప్రయాణికులు పోటీ పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో సోమవారం ఉదయం దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పెద్దసంఖ్యలో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. పది గంటల సమయంలో వేలాది మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్‌ కిక్కిరిసిపోయింది.

అదే సమయంలో ఆర్టీసీ గ్యారేజీ నుంచి విజయవాడకు వెళ్లే బస్సు ప్లాట్‌ఫాంకు వస్తుండగా.. ఒక్కసారిగా వందలాది ప్రయాణికులు గ్యారేజీ వైపునకు వెళ్లి బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. బస్సు కదులుతూ ఉండగానే సీటు కోసం తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా డోరు తగిలి పలువురు ఒకరిపై ఒకరు కిందపడిపోయి తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనలో పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన బెల్లంకొండ చిన్న అంకయ్య, నూజెండ్ల మండలం కొత్త నాగిరెడ్డిపల్లికి చెందిన పరిమి కోటమ్మకు చేతులు విరిగిపోయాయి. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ఎండపల్లికి చెందిన ఎస్తేరురాణి, పుల్లలచెరువు తండాకు చెందిన బాణావత్‌ మంత్రిబాయికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ప్రైవేటు వాహనంలో పట్టణంలోని వివిధ వైద్యశాలలకు తరలించారు.  

ప్రభుత్వం, ఆర్టీసీ వైఫల్యం వల్లే... 
సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా ప్రత్యేక బస్సులు నడపడంలో చంద్రబాబు ప్రభుత్వం, ఆర్టీసీ ఘోరంగా విఫలమయ్యాయని పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. సెలవుల అనంతరం తీవ్ర రద్దీ ఉంటుందని తెలిసినా కూడా అదనపు సర్విసులు నడపకపోవడం వల్లే వినుకొండ డిపోలో తొక్కిసలాట జరిగిందని ప్రయాణికులు మండిపడ్డారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)