Breaking News

ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం

Published on Sat, 04/19/2025 - 03:49

సాక్షి, అమరావతి: ఇప్పటికే టోఫెల్‌ ఎత్తేశారు.. అమ్మ ఒడి ఆపేశారు.. విద్యార్థుల ట్యాబ్‌లకు ఎగనామం పెట్టారు. నాడు–నేడు నిలిపివేశారు. గోరుముద్ద నాణ్యత తగ్గించేశారు. ఇప్పుడు సబ్జెక్ట్‌ టీచర్లను ఎత్తివేస్తూ ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను పునర్‌ వ్యవస్థీకరించనున్నారు. ఐదు రకాల పాఠశాలలకు తగినట్లుగా టీచర్లను  కేటాయించనున్నట్టు (టీచర్స్‌ రీపోర్షనేట్‌) పాఠ­శా­ల విద్యాశాఖ శుక్రవారం ఎంఈవోలకు మార్గ­దర్శకాలు విడుదల చేసింది. 

2025–26 విద్యా సంవత్సరం నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. దీని ప్రకారం రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. ఇందులో ఫౌండేషన్‌ స్కూల్‌ (1, 2 తరగతులు), బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌ (1–5), మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ (1–5), అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ (1–8), ఉన్నత పాఠశాలలు (1–10) ఉండనున్నాయి.  

టీచర్ల కేటాయింపు ఇలా.. 
» ఫౌండేషన్‌ (1, 2): ఒకటి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్‌జీటీ, 31–60 మంది వరకు ఇద్దరు ఎస్‌జీటీలు ఉంటారు.  
»  బేసిక్‌ ప్రైమరీ (1–5): ఒకటి నుంచి 20 మంది విద్యార్థులకు ఒక ఎస్‌జీటీ, 21 నుంచి 60 వరకు విద్యార్థులుంటే ఇద్దరు ఎస్‌జీటీలు బోధిస్తారు. 
»  మోడల్‌ ప్రైమరీ (1–5): 59 మంది విద్యార్థుల వరకు నలుగురు టీచర్లను కేటాయించారు. ఎస్‌జీటీల్లో మిగులు ఉంటే ఐదుగురిని కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య 60 మంది, ఆపై 150 వరకు ఉంటే ఒక హెచ్‌ఎం, నలుగురు ఎస్‌జీటీలను ఇస్తారు. అలాగే, 120 దాటిన తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్‌జీటీని కేటాయిస్తారు.  
» ప్రాథమికోన్నత (యూపీ) పాఠశాలలు (1–8): ఈ పాఠశాలల్లోని 1–5 తరగతుల వరకు బోధనా సిబ్బంది నియామకానికి బేసిక్‌ ప్రైమరీ/ మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల నిబంధనలే వర్తిస్తాయి. ఆరు నుంచి 8వ తరగతి వరకు 10 మంది విద్యార్థులకు ఒక ఎస్‌జీటీ, 11 నుంచి 30 వరకు ఇద్దరు ఎస్‌జీటీలు 31– 140 వరకు నలుగురు ఎస్‌జీటీలు, 141–175 మంది విద్యార్థుల వరకు ఐదుగురు ఎస్‌జీటీలను మంజూరు చేస్తారు.  
» ఉన్నత పాఠశాలలు (1–10): బేసిక్‌ ప్రైమరీ స్కూల్లో కేవలం ఎస్‌జీటీలే ఉంటారు. ఇందులో 10 మంది విద్యార్థుల వరకు ఇద్దరు టీచర్లు, 11 నుంచి 30 మంది విద్యార్థులకు ముగ్గురు, 31–40 మందికి నలుగురు, 40 మందికి పైన విద్యార్థులకు ఐదుగురు ఎస్‌జీటీలు ఉంటారు. 

6–10 తరగతులకే సబ్జెక్టు టీచర్లు 
గత ప్రభుత్వంలో హైసూ్కళ్లలో విలీనమైన 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్‌ బోధనను రద్దు చేశా­రు. కేవలం 6 నుంచి 10 తరగతులకు మాత్రమే స్కూల్‌ అసిస్టెంట్లు బోధిస్తారు. ఇందులో సెక్షన్‌ బట్టి టీచర్ల కేటాయింపు జరిగింది. సెక్షన్ల ఆధారంగా స్టాఫ్‌ ప్యాట్రన్‌ నిర్ణయించారు. 54 మంది విద్యార్థుల వరకు మొదటి సెక్షన్‌గా పరిగణిస్తా­రు. అనంతరం ప్రతి 40 మందికి ఒక అదనపు సెక­్షన్‌గా లెక్కిస్తారు.  ఇలా 5 నుంచి 25 సెక్షన్ల వర­కు విభజించి, 8 నుంచి 31 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. 

ఉన్నత పాఠశాలల్లో 76 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీని కేటాయిస్తారు. అంతకంటే తక్కువుంటే ఈ పోస్టులు ఉండవు. జనవరిలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో 3–5 తరగతులతో ఏర్పాటు చేస్తామన్న మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ప్రస్తావన తాజా ఆదేశాల్లో లేకపోవడంపై టీచర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)