Breaking News

విద్యుత్‌ డిస్కంలకు కొత్త బాసులు

Published on Fri, 09/12/2025 - 05:13

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సంస్థల్లో ఇన్నాళ్లూ కిందిస్థాయి ఉద్యోగుల బదిలీలతో తీరిక లేకుండా గడిపిన ఉన్నతాధికారులకు ఇప్పుడు వారి వంతు వచ్చిoది. దీంతో వారిలో టెన్షన్‌ మొదలైంది. ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు కొత్త బాస్‌లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేయడమే ఇందుకు కారణం. ఒక్కో డిస్కంకు ఒక్కో సమయంలో సీఎండీల నియామకం జరుగుతుంటుంది. కానీ ఈసారి మూడు డిస్కంలకు ఒకేసారి సీఎండీల స్థాన చలనం జరిగే అవకాశం ఉందని ఇంధన శాఖ వర్గాలు చెబుతున్నాయి.  

తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) సీఎండీగా ఉన్న ఐ.పృథ్వీతేజ్‌ బదిలీ దాదాపు ఖరారైంది. జేఎండీగా, సీఎండీగా విశేష అనుభవం ఉన్న పృథ్వీతేజ్‌ గత ప్రభుత్వంలో సీఎండీ అయ్యారు. కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నారు. విశాఖపట్నం కేంద్రంగా 11 జిల్లాలకు విద్యుత్‌ సరఫరా బా­ధ్య­తలతో పాటు విశాఖలో భూగర్భ విద్యుత్‌ లైన్ల ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అనేక విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. 

కూటమి పార్టీల నాయకులు కొందరు ఆయనపట్ల గుర్రుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన ఉద్యోగుల బదిలీల్లో ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు వెల్లువెత్తాయి. వారు చెప్పినవారికి పోస్టింగులు కూడా వచ్చాయి.   ఉద్యోగుల సంఘాలతోనూ పృథ్వీ సానుకూలంగానే ఉంటున్నారు. అయినప్పటికీ కొందరు నేతలు తాము చెప్పిన పనులను చే­యడం లేదంటూ ఆయన బదిలీకి ప్రభుత్వ పెద్దల వద్ద పట్టుబట్టారు. 

ఇదంతా తెలిసి సీఎండీ కొద్ది రోజుల కిందట సంబంధిత నాయకులను కలిసి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మరికొంత కాలం ప్రస్తుత స్థానంలోనే కొనసాగించాలని అభ్యర్థించారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఉత్తరాంధ్రలో ఏదైనా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)గా పంపించాలని కోరారని తెలిసింది. దీనిపై ప్రభు­త్వం నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉంది. పృథ్వీ బదిలీ ఖరారవడంతో ఆ స్థానంలోకి తిరిగి రావాలని ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ కె.సంతోషరావు ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలోనూ సీఎండీగా కొన్నేళ్లు పనిచేశారు. 

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీగా ఇటీవలే వచ్చిన పి.పుల్లారెడ్డి తనను ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీగా పంపాలని అడుగుతున్నారు. దీంతో ముగ్గురు సీఎండీలకు స్థాన చలనం క­లిగే అవకాశముంది. సంతోషరావు, పుల్లారెడ్డిలను కదిపి­­నా కదపకపోయినా, ఒక కొత్త సీఎండీ రావడం ఖాయం.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)