Breaking News

వేధింపులు తట్టుకోలేక స్టాఫ్‌నర్సు ఆత్మహత్యాయత్నం

Published on Sun, 01/25/2026 - 04:42

చల్లపల్లి (అవనిగడ్డ): చంద్రబాబు ప్రభుత్వంలో పనిభారం, అధికారుల ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురైన స్టాఫ్‌నర్సు కాజ అనిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పనిచేయడం కంటే చావడమే మేలనుకుని నిద్రమాత్రలు మింగింది. ఈ ఘటన కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, శ్రీకాకుళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్ర­వారం రాత్రి జరిగింది. అనిత తల్లి నాగమణి, అత్త పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. కాజ అనిత (34) నాలుగేళ్లుగా శ్రీకాకుళం పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్నారు. 

ఆమెకు భర్త శ్రీకాంత్, కుమారుడు ఆనంద్‌కుమార్, కుమార్తె బేబీ సు­నైన ఉన్నారు. భర్త శ్రీకాంత్, కొడుకు ఆనంద్‌కుమా­ర్‌కు అనారోగ్య సమస్యలున్నాయి. భర్త, కు­మా­రుడిని చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో గుడివాడలో ఉన్న అత్తమామల వద్దే ఉంటూ అక్కడి నుంచే రోజూ విధులకు హాజరవుతోంది. ఈ క్రమంలో కొంత కాలంగా పనిభారం ఎక్కువైంది. రాత్రి, పగలూ విరామం లేకుండా వెంటవెంటనే డ్యూ­టీలు వేస్తున్నా­రు. 

భర్త, కొడు­కుని ఆస్ప­­త్రికి తీసుకెళ్లి చూపించేందుకు అనితకు ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వ­డం లేదు. నాలుగు నెలల క్రితం వచ్చిన వైద్యురాలు మరింత వేధింపులకు గురి చేస్తూ మెమోలు ఇస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒక వైపు జిల్లా అధికారుల చుట్టూ తిప్పుతూ, మరోవైపు అదనపు పనిభారం మోపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉండగా నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. 

తోటి సిబ్బంది వెంటనే చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఈ ఘటన జరిగితే శనివారం సాయంత్రం వరకూ ఏ ఒక్క అధికారీ వచ్చి పలకరించలేదని అనిత కుటుంబ సభ్యులు వాపో­యారు. అనితకు ఈ పరిస్థితి కల్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  

రెండేళ్లుగా పెరిగిన పనిభారం 
రెండేళ్ల నుంచి పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని, ప్రా­ణం మీదకు వచ్చినా ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వడం లేదని అనితను చూసేందుకు చల్లపల్లి ఆస్పత్రికి వచ్చిన శ్రీకాకుళం పీహెచ్‌సీ వైద్య సిబ్బంది వాపోయారు. తాము అనారోగ్యానికి గురైతే చేతికి సెలైన్‌ సీసాలు కట్టుకుని ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, తమ కష్టం ఎవరికీ రాకూడదని వేడుకొంటున్నా­రు. స్టాఫ్‌నర్సుల పరిస్థితే ఆత్మహత్య చేసుకునేలా ఉందంటే కింది స్థాయి సిబ్బంది ఇంకెంత దయనీయస్థితిలో ఉన్నారో అర్థం చేసు­కోవాలని పలువురు సిబ్బంది తమ ఆవేదన వ్యక్తం చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)