Breaking News

కృష్ణమ్మ పరవళ్లు

Published on Sat, 10/26/2024 - 05:57

శ్రీశైలంప్రాజెక్ట్‌/ విజయపురిసౌత్‌/సత్రశాల (రెంటచింతల)/తాడేపల్లి రూరల్‌ : ఆయా ప్రా­జెక్టుల నుంచి శుక్రవారం నీటిని దిగు­వకు విడుదల చేస్తుండడంతో పరీవాహక ప్రాంతాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.  శ్రీశైలం జలాశయం గత మూడురోజులుగా గరిష్టస్థాయి 885 అడుగుల వద్ద ఉంది. 

ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని బట్టి దిగువ ప్రాజెక్ట్‌లకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,26, 281 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. 2గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 55, 782 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తు­న్నారు. డ్యాం నీటిమట్టం 884.60 అడుగు­లకు చేరుకుంది. 

సాగర్‌ 12 క్రస్ట్‌గేట్ల ద్వారా..
నాగార్జునసాగర్‌ నుంచి 12 క్రస్ట్‌గేట్ల ద్వారా  నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్‌ జలాశయం 12 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 96,324 క్యూసెక్కులను విడుదల చేస్తు­న్నారు. ప్రస్తుతం సాగర్‌ జలాశయ నీటి­మట్టం 589.30 అడుగుల వద్ద ఉండగా, ఇది 309.9534 టీఎంసీలకు సమానం.  

పులిచింతల నుంచి..
నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా 1,93,966 క్యూసె­క్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేశారు. ప్రాజెక్టు రిజర్వాయర్‌లో గ­రిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకు గా­నూ ప్రస్తుతం 6.860 టీఎంసీలు నిల్వ ఉంది.

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి..
ప్రకాశం బ్యారేజ్‌ వద్దకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో ప్రాజెక్టు 70 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 2 లక్షల 20 వేల 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట్, ఇతర వాగుల నుంచి 2 లక్షల 36 వేల 158 క్యూసెక్కుల వరదనీరు ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చి చేరుతోంది. 

బ్యారేజీ రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా.. తూర్పు డెల్టా కాలువకు 8 వేల 632 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7 వేల 26 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)