Breaking News

తొమ్మిదేళ్ల బాలికతో దేవదేవుని వివాహం

Published on Sun, 05/26/2024 - 04:25

రాయదుర్గంటౌన్‌: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి కల్యాణం తొమ్మిదేళ్ల బాలికతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి ఇక్కడ కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా అరవ తెగకు చెందిన బాలికతో దేవదేవుని కల్యాణం జరిపించారు. స్వామి వారిని వివాహమాడిన ఆ బాలికకు సుగుణ æసంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.

ఈ ఏడాది రాయదుర్గం పట్టణానికి చెందిన అరవ రమే‹Ù, జయమ్మ దంపతుల కుమార్తె మౌనికతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు వ్యవహరించారు. శనివారం ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు అయిన పద్మావతి (మౌనిక)ని ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా తెచ్చారు. అనంతరం శ్రీవారి ఉత్సవ విగ్రహం ముందు కూర్చోబెట్టారు.

వేద మంత్రోచ్ఛారణ మధ్య  వివాహం జరిపించారు. అభిజిత్‌ లగ్న శుభపుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో తల్లి కట్టడంతో పెళ్లితంతు ముగిసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)