Breaking News

యువత గం'జాయ్'

Published on Sun, 10/19/2025 - 05:40

పుట్టపర్తి శివారు ప్రాంతాల్లో చీకటి పడగానే యువత ఓ చోటకు చేరుతున్నారు. గంజాయిని గుప్పుగుప్పుమంటూ పీలుస్తూ మత్తులో తూలిపోతున్నారు. చిత్రావతి నది పరివాహక ప్రాంతంతో పాటు సాయినగర్‌లో విచ్చలవిడిగా  గంజాయి వినియోగిస్తున్నట్లు తెలిసింది. చిత్రావతి రోడ్డులోని చాలామంది యువత గంజాయికి బానిసలైనట్లు సమాచారం. ఇక హిందూపురం, కదిరి, ధర్మవరం తదితర ప్రాంతాల్లోనూ గంజాయి మత్తుకు చాలామంది బానిసలయ్యారు.

సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా యువత ‘దమ్మారో దమ్‌’ అంటూ గంజాయి మత్తులో తూలుతోంది. ఇన్నాళ్లూ పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన గంజాయి.. ఇప్పుడు పల్లెలకూ పాకింది. దీంతో గంజాయి విక్రయిస్తున్న.. వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గుడి, బడి తేడా లేకుండా అన్ని చోట్ల గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి.. 
గంజాయి ఎక్కువగా ఒరిసా, కర్ణాటక నుంచి జిల్లాకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గంజాయి.. తొలుత పెనుకొండ చేరుకుంటుంది. అక్కడక్కడా నిల్వ చేసి చాక్లెట్లు, పెన్నుల్లో నింపి విక్రయిస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో కొనేవారు కూడా రూ.100 చెల్లిస్తే రోజుకు కావాల్సినంత మత్తు వచ్చే గంజాయి లభిస్తోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బడాబాబుల అండదండలతో కొందరు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుండటంతో యువత, విద్యార్థులు  మత్తుకు అలవాటు పడు తున్నట్లు తెలుస్తోంది. 

మత్తులో నేరాలకు పాల్పడుతూ.. 
గంజాయి అలవాటు పడిన వారు రోజూ సాయంత్రం కాగానే సరుకు గురించి ఆరా తీస్తున్నారు.  వా­ట్సాప్‌ గ్రూప్‌ల సమాచారం ఆధారంగా గంజాయి దొరికే ప్రాంతానికి వెళ్లి మత్తులో మునిగిపోతున్నారు. అయితే గంజాయి విక్రేతలు రోజుకో ప్రాంతాన్ని ఎంపిక చేయడం... అంతదూరం వెళ్లి గంజా­యి తాగిన వారు తిరిగి వచ్చే సమయంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొందరైతే హత్యల­కూ వెనుకాడటం లేదు. ఇటీవల పుట్టపర్తి మున్సి­పా­లిటీ బ్రాహ్మణపల్లిలో ఓ హత్య కేసులోని నిందితులు ఘటన సమయంలో గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది.

ఇక చిత్రావతి రోడ్డులో ఓ విదేశీయుడు గంజాయి మత్తులో భవనం పైనుంచి పడి చనిపోయిన ఘటన నెల క్రితం వెలుగు చూసింది. ఇక గతేడాది విజయదశమి రోజున చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి వద్ద అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం చేసిన వారందరూ గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది.  వారిపై గతంలోనూ గంజాయి కేసులున్నాయి.

వదిలిపెట్టే ప్రసక్తే లేదు  
గంజాయి రహిత జిల్లా­గా మార్చేందుకు కృషి చేస్తున్నాం. గంజాయి విక్రేతలు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు. యువత కూడా మత్తుకు దూరంగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి. దాడులు చేసి నిందితులను పట్టుకుంటాం.     – సతీశ్‌కుమార్, ఎస్పీ  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)