Breaking News

ఆధ్యాత్మిక సమాచారం

Published on Wed, 08/28/2024 - 10:33

శ్రీవారి దర్శనానికి 20 గంటలు 
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు  నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,910 మంది స్వామివారిని దర్శించుకోగా 30,320 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.26 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

బ్రహ్మోత్సవాలను జయప్రదం చేద్దాం..
కాణిపాకం:  చిత్తూరు జిల్లా కాణిపాకంలో  సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు,  పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌లు పేర్కొన్నారు. కాణిపాకం ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం  స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం  నిర్వహించారు. 

ద్వారకాతిరుమలలో కృష్ణాష్టమి శోభ 
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దివ్యక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మంగళవారం నేత్రపర్వంగా జరిగాయి. కొండపైన గోసంరక్షణశాలలో, అలాగే ఆలయ తూర్పు ప్రాంతంలోని సప్తగోకులంలో పెద్ద ఎత్తున భక్తులు గోవులకు పూ­జలు నిర్వహించారు.  బుధవారం సాయంత్రం శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగను వైభవంగా జరుపనున్నట్టు ఆలయ ఈఓ తెలిపారు.  

అప్పన్నకు విశేషంగా గరుడసేవ 
సింహాచలం: సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం గరుడసేవ విశేషంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఆలయ కల్యాణ మండపంలో వెండి గరుడవాహనంపై వేంచేపుచేశారు. అషో్టత్తర శతనామావళి పూజ నిర్వహించారు. విశేష హారతులిచ్చారు.   

ఘనంగా శ్రావణలక్ష్మి పూజలు 
డాబాగార్డెన్స్‌: విశాఖ నగరంలోని బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా శ్రీలక్ష్మి పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు శ్రీలక్ష్మి పూజలు ప్రారంభించారు.   

ఆదిత్యుని హుండీ ఆదాయం రూ.70.96 లక్షలు 
శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల ద్వారా రూ.70,96,186 ఆదాయం లభించినట్లు ఈఓ డీఎల్‌వీ రమేష్‌బాబు తెలిపారు. జూన్‌ 10 నుంచి ఈనెల 27 వరకూ  మొత్తం 77 రోజులకు గాను ఈ మేరకు ఆదాయం లభించినట్లు ఆయన తెలిపారు.  

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)