Breaking News

TTD: నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

Published on Sat, 08/24/2024 - 08:54

తిరుపతి, సాక్షి:  తిరుమల శ్రీవారి నవంబర్‌ నెల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్…! నవంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తోంది. ఇప్పటికే అంగప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా టికెట్లను విడుదల చేసేసింది. అయితే ఇవాళ(ఆగస్టు 24) ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది.  

మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లను కూడా టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in  వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఆగష్టు 27వ తేదీన తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. న‌వ‌నీత సేవ టికెట్లు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ టికెట్లను మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ 
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ  . శ్రీవారి దర్శనానికి 24   గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31  కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 69,098  మంది స్వామి వారిని దర్శించుకున్నారు.  34,707   మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56  కోట్లు  . మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12   కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.5  గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4  గంటల సమయం పడుతోంది.

 

 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)