Breaking News

బ్రోకరిజం ఆయన మేనరిజం

Published on Fri, 06/05/2026 - 05:37

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)లో భూసమీకరణ, భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న ఓ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ఎస్‌డీసీ) తీరుపై ఆ సంస్థలో పనిచేస్తున్న అధికారవర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన తీరును చూసి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరా? రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరా అంటూ నివ్వెరపోతున్నాయి. తమ కడుపు కొట్టి ఇప్పటికే దాదాపు  రూ.15 కోట్లు ఆ అధికారి వెనకేసుకున్నారని బాధిత రైతులు వాపోతున్నారు.  

నోటిఫికేషన్‌ల ఆసరాగా అడుగులు 
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 37,941.58 ఎకరాలు సమీకరించాల్సి ఉండగా ఇప్పటి వరకూ భూసమీకరణ పథకం కింద 35,017.89 ఎకరాలు సమీకరించారు. మరో 117.54 ఎకరాల భూమిని భూసేకరణ చట్టం–2013 కింద సేకరించారు. ఇంకా 2,806.15 ఎకరాల భూమిని సమీకరించాల్సి ఉంది. ఆ భూమిని సీఆర్‌డీఏకు భూసమీకరణ కింద ఇచ్చేందుకు ఉండవల్లి, పెనుమాక, లింగాయపాలెం, నేలపాడు, మందడం, రాయపూడి తదితర గ్రామాల రైతులు అంగీకరించడం లేదు.

 భూసమీకరణ కింద భూములు ఇవ్వకపోతే భూసేకరణ చట్టం–2013 కింద సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ భూములను సేకరించేందుకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌లు జారీ చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ ఎస్‌డీసీ రియల్టీ దందా ప్రారంభించాడు. భూములు ఇవ్వని రైతుల ఇళ్ల వద్దకు సదరు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వ్యక్తిగతంగా చాటుమాటుగా వెళ్తూ రూ.కోట్లు కూడబెట్టుకునే పన్నాగం పన్నాడు.  

ఎస్‌డీసీ చాటుమాటు బేరసారాల క్రమమిది 
మీ భూమిని  భూసేకరణ చట్టం–2013 కింద బలవంతంగా సేకరించడానికి నోటిఫికేషన్‌ ఇస్తాం. దీని వల్ల ఎకరానికి పరిహారం రూ.50 లక్షలకు మించి రాదు.. ఆ భూమిని నాకు అమ్మండి... అంతకంటే ఎక్కువ ఇస్తాను.. అంటూ తొలుత బేరసారాలకు, బెదిరింపులకు దిగుతున్నాడు. రైతులతో భూమి ధరను ఖరారు చేసుకున్నాక.. వాటిని రియల్టర్లకు తాను ఆ రైతులతో ఖరారు చేసుకున్న ధర కంటే అధిక ధరకు విక్రయించి లాభం దండుకుంటున్నాడు. 

మరోవైపు ఆ రియల్టర్‌ నుంచి 2 శాతం కమిషన్‌ కూడా తీసుకుంటున్నాడు. తన ద్వారా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి భూసమీకరణ కింద సీఆర్‌డీఏకు అప్పగించిన రియల్టర్లకు.. రాజధానిలో ప్రధాన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తూ వారి వద్ద నుంచి లంచాలు మింగేస్తున్నాడు. కొండవీటివాగు వరద ముప్పు నివారణకు సీఆర్‌డీఏ చేపట్టిన పెనుమాక, శాఖమూరు, నీరుకొండ రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్‌ కోసం తవి్వన మట్టిని టిప్పర్‌ల చొప్పున విక్రయిస్తూ ఇప్పటికే భారీ ఎత్తున దోచేస్తున్నారని చెబుతున్న రైతులు, ఇప్పుడిక అధికారులు రియల్టర్ల  అవతారం కూడా ఎత్తడంపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)