Breaking News

ప్రతిపక్ష హోదా సాధ్యం కాదు

Published on Thu, 03/06/2025 - 05:21

సాక్షి, అమరావతి : తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరికను పరిశీలించడం సాధ్యం కాదని శాసనసభ స్పీకర్‌ సీహెచ్‌ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశంపై ఆయన రూలింగ్‌ ఇచ్చారు. ‘శాసనసభ అనేది ప్రజలు అనే దేవుళ్లు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. స్పీకర్‌గా నా బాధ్యత ఈ దేవాలయానికి పూజారిగా పని చేయడం మాత్రమే. దేవుడు తిరస్కరించిన వరా­న్ని పూజారి నుంచి ఆశించడం తప్పు. 

ప్రజలు నిరా­కరించిన హోదాను స్పీకర్‌ ఇవ్వజాలడు’ అని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది జూన్‌ 24 తేదీన రాసిన లేఖ అంతా అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం అన్నాడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదాకు అర్హత ఉందంటూ అసంబద్ద వాదనలు చేస్తున్నారని, లేఖలో ఎక్కడా ప్రత్యేక అభ్యర్థన లేదని తెలిపారు. లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత హైకోర్టును ఆశ్రయించారన్నారు. 

ఆ పిటిషన్‌ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉందని చెప్పారు.  అయితే ఇటీవల ఈ అంశంపై జగన్‌మోహన్‌రెడ్డి, వారి పార్టీ నాయకులు.. ఉత్తర్వులు జారీ చేయాలంటూ స్పీకర్‌కు హైకోర్టు స­మ­­­న్లు జారీ చేసిందని ప్రచారం చేస్తున్నట్టు వార్తలు రావడంతో తప్పుడు ప్రచారానికి రూలింగ్‌ ద్వారా తెరదించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చే­శా­రు. ఈ రూలింగ్‌లో స్పీకర్‌ ఇంకా ఏమన్నారంటే.. 

కనీసం 18 మంది సభ్యులుండాలి
‘జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు జూన్‌ 26 తేదీ వరకు మా సచివాలయానికి తెలపలేదు. అలాంటప్పుడు, జూన్‌ 26 కంటే ముందు, అందునా స్పీకర్‌ ఎన్నిక జరక్కముందే ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా? జగన్‌మోహన్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్న ఎన్నో అంశాలు సత్యదూరాలు. 

వాస్తవాలను, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే, 175 మంది సభ్యులున్న నేటి రాష్ట్ర శాసనసభలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదు. ఈ విషయమై స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది.   ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో చర్యలు తప్పవు’ అని స్పష్టం చేశారు.    

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)