Breaking News

జూన్‌ 5న తొలకరి పలకరింపు!

Published on Fri, 05/16/2025 - 05:08

సాక్షి, విశాఖపట్నం:    వచ్చే నెల మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. జూన్‌ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయని, 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు – కొమోరిన్‌ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతోపాటు, అండమాన్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలోకి విస్తరించాయి. 3–4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, అండమాన్‌లోని మిగిలిన ప్రాంతాలతోపాటు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

రాష్ట్రంలో భిన్న వాతావరణం
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాసే­పు మబ్బులు, కాసేపు వడగాలులు, కాసేపు ఈదురుగాలుతో వాతావరణం దోబూచులాడింది. ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మరికొని్నచోట్ల ఓ మోస్తరు వానలు పడ్డా­యి. అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌­లో వాయు­వ్య, నైరుతి దిశగా వీస్తున్న గాలుల వల్ల ఈ భిన్న వాతావరణం నెలకొందని నిపుణులు చెబుతున్నారు. 

నేడు, రేపూ ఎండా, వాన దోబూచులాటే..!
శుక్ర, శనివారాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగే సూచనలు ఉన్నాయని పేర్కొంటున్నారు. శుక్రవారం రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడేందుకు అవకాశం ఉందని తెలి­పారు. 

శుక్రవారం ఉత్తరాంధ్రలో 10 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో నిడమర్రు, అమలాపురంలో 54 మిమీ, కాజులూరులో 42, కె.కోటపాడులో 41, ఉంగుటూరులో 35, కరపలో 32.2, పిఠాపురంలో 31.7 మిమీ వర్షపాతం నమోదైంది.

పలమనేరులో భారీ వర్షం
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో దద్దరిల్లింది. ఈదురు గాలుల వల్ల పలుచోట్ల మామిడి నేల రాలింది. కోతకొచి్చన టమాట పంట దెబ్బతింది. తీగపంటలైన కాకర, బీర, బీన్స్, రాగి పంటలు నేలవాలాయి. కొన్ని చోట్ల అరటిపంటకు నష్టం వాటిల్లింది. నడిమిదొడ్డిపల్లిలో కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)