Breaking News

మద్యం మత్తులో తండ్రి హత్య

Published on Thu, 09/04/2025 - 05:40

కరప: కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్న మద్యం బంధాలను చిదిమేస్తోంది. మద్యం మత్తు తండ్రీకొడుకుల మధ్య ఘర్షణకు దారి తీసి, చివరికి తండ్రిని తనయుడు కడతేర్చేలా చేసిన ఘటన కాకినాడ జిల్లా కరప పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మొండి గ్రామానికి చెందిన కాలాడి సూర్యచంద్రరావు(50)కు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు ధనుంజయ్‌కు వివాహం కాగా వేరు కాపురం పెట్టాడు. 

భార్య అనారోగ్యంతో మరణించగా, తండ్రి మిగిలిన ముగ్గురి కుమారులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో సూర్యచంద్రరావు మద్యానికి బానిసయ్యాడు. రెండో కుమారుడు చంద్రశేఖర్‌ పనిచేస్తూ, అన్నీ చూసుకుంటూ, వంట చేసి పెడుతుంటాడు. చిన్నకుమారుడు మహేష్‌ ఫిట్స్‌ వ్యాధిగ్రస్తుడు. ఈ నేపథ్యంలో మంగళవారం మహేష్ కు మందులు తీసుకురమ్మని తండ్రికి చంద్రశేఖర్‌ రూ.500 ఇచ్చాడు. 

సూర్యచంద్రరావు ఆ డబ్బుతో మద్యం తాగి వచ్చాడు. దీంతో అప్పటికే మద్యం తాగి ఉన్న చంద్రశేఖర్‌ తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తండ్రి తలపై గొడ్డలి తిరగేసి దాడి చేయడంతో సూర్యచంద్రరావు మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాకినాడ రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)