Breaking News

ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేశాం

Published on Wed, 05/29/2024 - 05:28

నరసరావుపేట/బాపట్ల: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేటతో పాటు బాపట్లలో ఆయన పర్యటించారు. నరసరావుపేట మండలం కాకాని సమీపంలోని జేఎన్‌టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన మీనా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక జిల్లా అయినా పల్నాడులో రీపో­లింగ్‌కు అవకాశం లేకుండా ఎన్నికలు నిర్వహించారంటూ అధికారులను అభినందించారు. వెబ్‌­కా­స్టింగ్‌ వంటి ఏర్పాట్లు చేసినా కొన్ని బూత్‌­లలో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించటంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ పలు కఠిన చర్యలు తీసుకుందని చెప్పారు. 

కౌంటింగ్‌ ప్ర­క్రి­యను సజావుగా నిర్వహించి.. ఎన్నికల కమిష­న్‌పై ప్రజలకు నమ్మకం తీసుకొస్తామన్నారు. అవా­ంఛనీయ ఘటనలు జరిగితే సంబంధిత రిటరి్నంగ్‌ అధికారి వెంటనే స్పందించాలని ఆదేశించారు. 

మద్యం అమ్మకాలను నిషేధించాలి 
డీజీపీ హరీ‹Ùకుమార్‌గుప్తా మాట్లాడుతూ.. జూన్‌ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ శ్రీకేశ్‌ మాట్లాడుతూ.. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు 700 మందికి పైగా కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో పాటు ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. 

ఎస్పీ మలికా గార్గ్‌ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 1,196 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏడు ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో 59 మందిని అరెస్టు చేశామని చెప్పారు. సమావేశంలో పోలీస్‌ అధికారులు గోపినాథ్‌ జెట్టి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్, జేసీ శ్యాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఎల్రక్టానిక్‌ పరికరాలను అనుమతించొద్దు 
అలాగే బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములను, కౌంటింగ్‌ కేంద్రాల్లోని ఏర్పాట్లను సీఈవో ముఖే‹Ùకుమార్‌ మీనా మంగళవారం పరిశీలించారు. కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌ జిందాల్, జేసీ సీహెచ్‌ శ్రీధర్, ఆర్‌వోలతో మీనా సమావేశమయ్యారు. 

ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన పాస్‌లున్న వారినే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆయన ఆదేశించారు. సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, ఆర్‌వోలు ఉన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)