Breaking News

తల్లిదండ్రులు లేరు.. ఇద్దరినీ పెంచుకుంటారా..!

Published on Fri, 07/24/2026 - 14:04

విజయవాడ: తరుచూ తల్లి తమను మందలిస్తోందని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ అన్నాచెల్లులు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండం సీతానగరం చేరుకున్నారు.. బ్యారేజీ వద్ద చేపలు విక్రయిస్తున్న వారి వద్దకు వెళ్లి తమకు తల్లిదండ్రులు ఇద్దరు లేరని...  మమల్ని పెంచుకుంటారా అని అడిగారు. దీంతో వారు ఆ చిన్నారులను అక్కున చేర్చుకున్నారు.. 

కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన అఖిల్, స్వేచ్ఛ అన్నాచెల్లెలు.. వీరిని తల్లి ప్రతి చిన్న విషయానికి మందలించడం, తిట్టడం, కోప్పడడం చేయడంతో మనస్తాపానికి గురై 21వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులైన రాజేశ్వరి, మహే‹Ùలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన కొత్తపేట సీఐ కొండలరావు పర్యవేక్షణలో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు చిన్నారులు ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం సీతానగరంలో చేపల విక్రయించే వారిని ఆరా తీయగా, తమ వద్దే ఉన్నట్లు పేర్కొని వారిని పోలీసులకు అప్పగించారు. సెక్టార్‌ ఎస్‌ఐ భారతి చిన్నారుల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిని అప్పగించారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)