Breaking News

కార్లకు ‘టోల్‌’ పాస్‌లు

Published on Thu, 02/06/2025 - 05:00

సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై టోల్‌ గేట్‌ ఫీజుల చెల్లింపు ప్రక్రియను మరి­ంత సరళతరం చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త విధివిధానాలను రూపొందించింది. ప్రధానంగా ప్రైవేటు కార్ల యజమానులకు టోల్‌ ఫీజుల పాస్‌లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే ప్రైవే­టు కార్ల యజమానులకు సౌలభ్యంగా ఉం­డేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అన్‌ లిమి­టెడ్‌ యూసేజ్‌ (అపరివిుత వినియో­గం) ప్రాతిపదికన టోల్‌ ఫీజు పాస్‌లను రెండు కేటగిరీలుగా జారీ చేసే ముసాయిదాను ఎన్‌హెచ్‌ఏఐ తాజాగా ఆమోదించింది. 

ప్రస్తు­తం ఉన్న ఫాస్టాగ్‌ విధానం ద్వారా­­నే పాస్‌ల విధానాన్ని అమల్లోకి తెస్తారు. వార్షిక టోల్‌ ఫీజు పాస్, లైఫ్‌టైమ్‌ పాస్‌ (15ఏళ్లు)లను అందుబా­టు­లోకి తేను­ంది. వార్షిక పాస్‌ రూ.3 వేలు, లైఫ్‌­టైమ్‌ (15ఏళ్లు) పాస్‌ను రూ.30 వేలుగా నిర్ణయించింది. వార్షిక పాస్‌ తీసుకుంటే జాతీయ రహదారులపై టోల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏడాది­లో ఎన్ని సారై్లనా  దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటు­ంది. 

ఇక లైఫ్‌­టైమ్‌ పాస్‌ తీసుకుంటే ఆ వా­హన జీవిత కాలం అంటే గరిష్టంగా 15­ఏళ్ల పాటు టోల్‌ ఫీజు చెల్లించకుండా జాతీ­య రహదారులపై ఎన్నిసార్లయినా ప్రయా­ణించవచ్చు. ప్రస్తు­తం టోల్‌ గేట్లకు సమీపంలో ఉన్న గ్రామాల వారికి ఆ ఒక్క టోల్‌ గేటు వరకు పాస్‌ల విధానాన్ని అమలు చేస్తోంది. అందు­కోసం ఆ గ్రామాల ప్రజ­లు తమ అడ్రస్‌ ప్రూఫ్‌ను సమర్పిస్తే నెలకు రూ.340 పాస్‌­ను జారీ చేస్తోంది. అంటే ఏడాదికి రూ.4,080 అవుతోంది. 

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఏడాదిపాటు టోల్‌ ఫీజు లేకుండా ప్రయాణానికి రూ.3 వేలకే పాస్‌ అన్నది అత్యంత సమంజసమైనదిగా ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి. 2023–24లో టోల్‌ఫీజుల రూపంలో రూ.55వేల కోట్లు వసూలయ్యా­యి. వాటి­­లో ప్రైవేటు కార్ల వాటా రూ.8 వేల కోట్లు మాత్రమే. 

కాబట్టి ప్రైవేటు కార్లకు వార్షిక, లైఫ్‌టైమ్‌ టోల్‌ ఫీజు పాస్‌ల జారీ­తో రాబడిపై పెద్దగా ప్రతి­కూల ప్రభా­వం చూపించదని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది. టోల్‌ ఫీజుల పాస్‌­ల జారీ కోసం ఎన్‌హెచ్‌ఏఐ రూపొందించిన ముసా­యిదాపై కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)