Breaking News

శ్రీ సిమెంట్‌ ఉత్పత్తి షురూ 

Published on Fri, 04/05/2024 - 05:00

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ పరిశ్ర­మ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రభుత్వ సహకారంతో నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 6 నెలల ముందుగానే ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా శ్రీ సిమెంట్‌ రికార్డు సృష్టించింది. గతేడాది విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న శ్రీ సిమెంట్‌ రికా­ర్డు సమయంలోనే యూనిట్‌ను సిద్ధం చేసింది.

పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద రూ.2,500 కోట్లతో ఏర్పాటు చేసిన సిమెంట్‌ పరిశ్రమ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్టు శ్రీ సిమెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీరజ్‌ అకోరే ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రారం¿ోత్సవ కార్యక్రమాలు నిర్వహించకుండానే ఉత్పత్తిని ప్రారంభించినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు.

ఏటా 3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన దాచేపల్లి యూనిట్‌తో శ్రీ సిమెంట్‌ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 56.4 మిలియన్‌ టన్నులకు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అవసరాలను తీర్చేవిధంగా దాచేపల్లిలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు శ్రీ సిమెంట్‌ ప్రకటించింది. ఈ యూనిట్‌ రాకతో మొత్తం 2,000 మందికి ఉపాధి లభించిందని, ఇందులో అత్యధికంగా స్థానిక యువతకే ప్రాధాన్యతను కల్పించామని పేర్కొంది. 

దేశంలోనే తొలి పర్యావరణహిత యూనిట్‌ 
పూర్తిగా పర్యావరణహితంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దాచేపల్లి యూనిట్‌ నిర్మించినట్టు నీరజ్‌ తెలిపారు. ఈ యూనిట్‌కు అవసరమయ్యే ఇంధన వినియో­గంలో 30 శాతం మునిసిపల్‌ వ్యర్థాలు, బయోమాస్‌తో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు.

ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించి 30 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్న తొలి సిమెంట్‌ యూనిట్‌గా దాచేపల్లి రికార్డులకు ఎక్కింది. అదేవిధంగా సున్నపురాయి తవ్వకాన్ని కూడా ప్రయోగాత్మకంగా చేపట్టడం ద్వారా ఇంధన పొదుపు చేస్తున్నట్టు తెలిపారు. భూ మట్టానికి 40 అడు­గుల దిగువన సున్నపురాయి క్రషింగ్‌ను చేపట్టడం ద్వారా డీజిల్‌ వినియోగాన్ని గణనీయంగా తగ్గించగలిగినట్టు వివరించారు.

భారీగా విస్తరణ 
భంగర్‌బ్రాండ్‌ పేరుతో శ్రీ సిమెంట్‌ భారీ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందు­లో భాగంగా మరో 13 యూనిట్లను ఏర్పా­టు చేయనుంది. ప్రస్తుతం ఏడాదికి 56.4 మిలియన్‌ టన్నులుగా ఉన్న సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 2028 నాటికి 80 మిలి­యన్‌ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2025 నాటికి మరో 5 యూనిట్లను వాణిజ్యపరంగా ఉత్ప­త్తిలో­కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)