Breaking News

బాలుడి దారుణ హత్య

Published on Sun, 11/02/2025 - 05:33

గండేపల్లి: పూటుగా తాగిన మద్యం మత్తు తలకెక్కి, విచక్షణ కోల్పోయి, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఓ కిరాతకుడు బాలుడిని కత్తితో నరికి చంపేశాడు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యర్రంపాలెం గ్రామంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..  యర్రంపాలేనికి చెందిన బుంగా బాబ్జీ అలియాస్‌ బాబీ (17), అతడి స్నేహితుడు ఇజ్జిన చందు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో కొమ్ము సత్తిబాబుకు చెందిన ఇంటి పునాదిపై కూర్చుని సెల్‌ఫోన్‌లో ఆడుతున్నారు. 

దీనికి ఎదురుగా నివాసం ఉంటున్న కాకర చిన్ని (సుమారు 50 ఏళ్లు) వీళ్ల వద్దకు వచ్చాడు. అర్ధరాత్రి ఏం పని మీకు, వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పటికే అతడు పూటుగా తాగి ఉన్నాడు. ఈ క్రమంలో బాబీ, చిన్ని మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన చిన్ని.. అక్కడే ఉంటే నరికేస్తానంటూ బాబీని బెదిరించి ఇంటికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే తిరిగి కత్తి పట్టుకుని వచ్చి, బాబీ మెడపై ఒక్కసారిగా నరికాడు. తీవ్రంగా గాయపడిన బాబీ అక్కడి నుంచి ఇంటికెళ్తూ రోడ్డుపై కుప్పకూలిపోయాడు. 

స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నిని బంధువులు శనివారం పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ‘రాత్రి అన్నం తిని అందరం పడుకున్నాం. ఎప్పుడు బయటకెళ్లాడో తెలీదు. నా కొడుకుని తీసుకురండి’ అంటూ హతుడు బాబీ తల్లి విజయకుమారి బోరున విలపిస్తోంది. ఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ఇన్‌చార్జి సీఐ బి. సూర్య అప్పారావు, గండేపల్లి ఎస్సై యూవీ శివనాగబాబు, సిబ్బంది పరిశీలించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)