Breaking News

చిన్నారిపై లైంగిక దాడికి యత్నం 

Published on Sat, 11/01/2025 - 05:34

చిల్లకూరు: తిరుపతి జిల్లా గూడూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి కోసం సాయంగా వచ్చిన 8 ఏళ్ల చిన్నారిపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరులోని పెద్ద మసీదు వీధికి చెందిన జమీర్‌ బాషా అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి సహాయకుడిగా వచ్చాడు. అదే సమయంలో పట్టణంలోని రాణిపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకుని వచ్చి చికిత్స అందిస్తున్నారు. 

వారితో పాటు 8 ఏళ్ల చిన్నారి కూడా ఆస్పత్రికి వచ్చింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చిన్నారికి నిద్ర వస్తుండటంతో కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న గదిలోని బెడ్‌పై పడుకోబెట్టారు. చిన్నారి ఒంటరిగా నిద్రిస్తున్న విషయం గుర్తించిన జమీర్‌బాషా చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. 

చిన్నారి కేకలు వేయడంతో ఆస్పత్రి భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని జమీర్‌బాషాకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై గూడూరు డీఎస్పీ గీతాకుమారి, అడిషనల్‌ ఎస్పీ రవిమనోహరాచారి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్టేషన్‌కు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని చెప్పారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి