Breaking News

బస్సు నడపాలా.. లేక జనాలను మోసుకెళ్లాలా?

Published on Sun, 07/12/2026 - 13:24

మార్కాపురం జిల్లా: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో నిత్యం ఏదో ఒక చోట ప్రయాణికులతో బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పొదిలిలో గొడవ జరిగి డ్రైవర్‌ బస్సు దిగి వెళ్లిన ఘటనను మరవకముందే శనివారం కంభం నుంచి అర్థవీడు లోయకు వెళ్లే బస్సులోనూ అదే విధంగా జరిగింది. బస్టాండులోనే నిండిపోయిన బస్సు.. అక్కడి నుంచి కందులాపురం సెంటర్‌కు వెళ్లగా ప్రయాణికులు వేచి ఉన్నారు. 

అదే చివరి బస్సు కావడంతో అక్కడున్న వారంతా అదే బస్సులో ఎక్కారు. బస్సులో కండక్టర్‌ కూడా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పాటు డోర్‌ వద్ద వేలాడుతూ ప్రయాణికులు ఉండిపోయారు. దీంతో కొంచెం ముందుకు వెళ్లిన డ్రైవర్‌. బస్సు ఆపేసి కిందకు దిగిపోయాడు. ఇలాగైతే బస్సు నడపలేనని తేల్చి చెప్పాడు. పాపినేనిపల్లి రూటు కొండ ప్రాంతం మీదుగా వెళ్లాల్సి రావడం, ముందు వెళ్లే వాహనాల వారు సైడు ఇవ్వరని, అలాంటప్పుడు బస్సు ఎలా నడపాలని, పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలని డ్రైవర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 

బస్సులు లేకుంటే తాము ఊర్లకు ఎలా వెళ్లాలని, ఇదే ఆఖరి బస్సు కావడంతో తప్పనిసరి పరిస్థితిలో ఎక్కాల్సి వచ్చిందని ప్రయాణికులు సైతం ఆర్టీసీ సిబ్బందితో వాదనకు దిగారు. కొంతసేపటి వరకు బస్సును అక్కడే నిలిపివేసిన డ్రైవర్‌.. అనంతరం కొందరు ప్రయాణికులు, స్థానికులు సర్దిచెప్పడంతో చేసేదేమీ లేక బయలుదేరాడు. కాగా, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత ఎక్కువ మంది మహిళలు బస్సులెక్కడం వలనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పలువురు ప్రయాణికులు చెప్పుకొచ్చారు.


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)