Breaking News

తెనాలి.. ‘సప్తాహ ముద్దపప్పు’ తినాలి

Published on Wed, 05/29/2024 - 05:41

ఆ రోజుల్లో: మాఘ మాసం వచ్చి0దంటే.. తెనాలి రామలింగేశ్వరపేటలోని శంకర మఠం ముద్దపప్పు సప్తాహాలతో ఘుమఘుమలాడేది. వారం రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి తెనాలి చుట్టుపక్కల గల ఆరు అగ్రహారాల నుంచి వేద పండితులతోపాటు అన్ని కులాల్లోని ముద్దపప్పు ప్రియులు ముద్దపప్పు భోజనం ఆరగించి.. మఠంలోనే నిద్రించే­వారు. 50 ఏళ్ల క్రితం వరకు కొనసాగిన ఈ ముద్దపప్పు సప్తాహాల విశేషాల్లోకి వెళితే..  

తెనాలి: ఎనిమిదో శతాబ్దపు తత్వవేత్త.. అద్వైత గురువు జగద్గురు ఆదిశంకరాచార్యులు పేరిట తెనాలి రామలింగేశ్వరపేటలోనూ శంకర మఠం ఏర్పాటైంది. దేవీచౌక్‌లోని చినరావూరు పార్కు రోడ్డులో కుడిపక్క పది సెంట్ల విస్తీర్ణంలో ఈ మఠం విస్తరించి ఉంది. మఠం వ్యవస్థాపకురాలు వేల­మూరి లింగమ్మ. కాషాయధారి ఎవ­రొచ్చి నా మ­ఠం­లోనే బస చేసేవారు. 

అప్పట్లో ఇక్కడ హోమా­లు, యజ్ఞాలతోపాటు మాఘ మా­సంలో ముద్దపప్పు సప్తాహాలు నిర్వహించే­వారు. మాఘశుద్ధ పాడ్యమి రోజు నుంచి మొ­దలై వారం రోజులపా­టు ముద్దపప్పు వేర్వేరు అ­ను­పానాలతో ముద్దపప్పు సప్తాహాలు జరిగేవి. వీ­టి­కితోడు హరికథ, బుర్రకథ, పురాణ పఠన కాలక్షే­­పాలతో శంకర మఠం ఓ వెలుగు వెలిగింది. సు­మా­రు 50 ఏళ్ల క్రితం వరకూ ఈ సప్తాహాలు జరిగేవి.  

సప్తాహాలు ఇలా: నలభీమ పాకంలో చెయ్యి తిరిగిన నరసరావుపేట వంటవారు కృష్ణా నదీ తీరమైన కొల్లూరు పొలాల్లో పండిన ఏడాది వయసు గల కందిపప్పును గోధుమ రంగు వచ్చే వరకు వేయించి.. బాగా ఉడకబెట్టి.. ఉప్పు, పసుపు వేసి ముద్దపప్పు వండేవారు. దీనికి అనుపానాలుగా అంగలకుదురు పుల్ల దోసకాయల్ని వినియోగించి.. అనకాపల్లి ఆవపిండి, చినరావూరు గానుగ నువ్వుల నూనె, బుడంపాడు ఎర్ర మిరపకాయలతో కొట్టిన కారం, వేటపాలెం రాళ్ల ఉప్పు వేసి.. దేవతా దోసా­వ­కాయ తయారు చేసేవారు. 

వలివేరు మెట్ట పొలా­ల్లో కాసిన ఎర్ర గుమ్మడి కాయలు, ముదురు బెండకాయల ముక్కలకు ప్రశస్తమైన ఇంగువ తిరగమోత (తాలింపు) వేసి.. గుమ్మడి ముక్కల పులుసు గొప్పగా చేసేవారు. అనంతవరంలో పండిన వడ్ల దంపుడు బియ్యంతో అన్నం వండేవారు. వేజెండ్ల గ్రామపు నెయ్యి.. సంగం జాగర్లమూడి బర్రెలు బకింగ్‌హాం కాలువ గట్టున గడ్డిమేసి ఇచ్చిన చిక్క­టి పాలతో జిడ్డు గడ్డ పెరుగు కుండల్లో తోడు పెట్టేవారు. 

ఇంగువ మినప వడియాలు, పెసర ఎర్ర అప్పడాలు వేయించేవారు. పచ్చల తాడిపర్రు అరిటాకులు పరిచి.. పంక్తులుగా వడ్డన చేయగా.. అలనాటి ఆ ముద్దపప్పు భోజనం చేసిన వారంతా తా­దా­త్మ్యం చెందేవారు. నాటి సప్తాహాలను వారణాసి మణెమ్మ మహిళ దగ్గరుండి చేయించేవారు. 

శుభకార్యాల్లో వంటలకు అప్పట్లో ఆమె ప్రసిద్ధి. మఠం వ్యవస్థాపకురాలు లింగమ్మ కుమారుడు శంకరశాస్త్రి ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మఠం నిర్వహణ చూస్తుండేవారు. తర్వాత శంకరమఠం శ్రీశృంగేరీ శారదా పీఠం అధీనంలోకి వెళ్లింది.  

మణెమ్మ మా అమ్మ 
మాది ప్రకాశం జిల్లా అద్దంకి. కుటుంబ పోషణ నిమిత్తం మా కుటుంబం తెనాలి చేరుకుంది. శుభకార్యాల్లో వంటలు చేయడంలో మా అమ్మ వారణాసి మణెమ్మ పేరు తెచ్చుకుంది. శంకర మఠం కేంద్రంగా జరిగిన ముద్దపప్పు సప్తాహాలు, కార్తీక సమారాధనలు మణెమ్మ చేతుల మీదుగానే జరిగేవి.  మా అమ్మ 26 ఏళ్ల క్రితం  చనిపోయారు. ఇప్పటికీ ఆమె పేరిట ఏటా కార్తీకమాస సమారాధనల్ని మఠంలో చేస్తున్నాం. – రాయప్రోలు సుందరమ్మ. మణెమ్మ పెద్ద కుమార్తె, సదాశివశాస్త్రి, మనవడు 

ఆ రోజుల్లో గొప్పగా ఉండేది 
ఆధ్యాత్మిక ప్రచారంలో ఒక వెలుగు వెలిగిన శంకర మఠం తర్వాతి కాలంలో ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. గొప్పగా నడిచిన ముద్దపప్పు సప్తాహాలు నిలిచిపోయాయి. భోజనం వడ్డనకు ముందు మా తండ్రి ములుకుట్ల సదాశివశాస్త్రి హరికథా కాలక్షేపం తప్పనిసరిగా ఉండేది.   – ములుకుట్ల విశ్వనాథశాస్త్రి,భక్తి ప్రచారక 

ధూపదీప నైవేద్యం ఇస్తున్నా 
శంకర మఠం శ్రీశృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఉంది. 30 ఏళ్లుగా ధూపదీప నైవేద్యం పెడుతున్నా.  మఠం ఆవరణలోని ఇంట్లో ఉండేవాళ్లం. మఠంతో సహా ఇల్లు శిథిలావస్థకు చేరటంతో అద్దె ఇంట్లోకి మారాల్సి  వచ్చి0ది.  – యనమండ్ర నరసింహమూర్తి, అర్చకస్వామి 

#

Tags : 1

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)