Breaking News

‘కాపులుప్పాడ’ నుంచి పోటెత్తిన వరద

Published on Tue, 09/10/2024 - 04:43

కొమ్మాది/బీచ్‌రోడ్డు :  విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్‌ గేట్లు ఎత్తివేయడంతో కాపులుప్పాడ గెడ్డ నుంచి కె.నగరపాలెం మీదుగా భారీఎత్తున వరద పోటెత్తింది. ఈ క్రమంలో కె.నగరపాలెంలో మూడు గేదెలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. అనంతరం ఇవి మృతిచెందినట్లు గుర్తించారు. అలాగే, గోవుపేట, గంగడపాలెం ప్రాంతాలు పూర్తిస్థాయిలో నీట మునగడంతో స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరదేశిపాలెం గెడ్డ కూడా పెద్దఎత్తున ప్రవహించడంతో ఈ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

బీచ్‌ రోడ్డులో చేపలుప్పాడ వద్ద సముద్రం ముందుకు రావడంతో ఇక్కడ తీరం భారీస్థాయిలో కోతకు గురైంది. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. మంగమారిపేట, రుషికొండ తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకొచి్చంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండలో బోటు షికారు నిలిపివేయడంతో బోట్లన్నీ తీరానికి పరిమితమయ్యాయి. ఇక మృతిచెందిన గేదెలకు రూ.37,500, పడ్డకి రూ.20వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మరోవైపు.. బీచ్‌రోడ్డులో కోస్టల్‌ బ్యాటరీ నుంచి వైఎంసీఏ వరకు రక్షణ గోడను తాకుతూ కెరటాలుఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకురావటంతో చూసేందుకు సందర్శకులు ఎక్కువగా బీచ్‌కు వస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)