Breaking News

రథ చక్రాల కింద నలిగిన భక్తులు

Published on Wed, 03/11/2026 - 03:02

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో మంగళవారం అపశృతి చోటుచేసుకుంది. తిరువీధుల్లో దక్షిణ గోపురం వద్దకు రథం రాగానే.. తోపులాట జరిగి ఆరుగురు భక్తులు రథం ముందు చక్రం కింద ఒకరిపై ఒకరు పడిపోయారు. జాకీ తీసుకొచ్చి రథాన్ని పైకి లేపేవరకూ 40 నిమిషాలపాటు వారు చక్రాల కిందే ఉండి నలిగిపోయి విలవిల్లాడిపోయారు. 

ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో భక్తులు అల్లాడారు. ఇంత జరుగుతున్నా రథం ముందు భాగంలో కూర్చున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఖాద్రీశుడి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకోవడం భక్తుల్లో అలజడి రేపింది. 

వరుస ఘటనలు జరుగుతున్నా నిర్లక్ష్యమే 
రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన తొలి ఏడాదే తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో విఫలమవడంతో ఆరుగురు భక్తుల మృతి చెందగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు, కాశీబుగ్గ తొక్కిసలాటలో 9 మంది మరణించారు. మహాశివరాత్రి వేళ శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. 

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో గోక్షీరంలో పురుగులు దర్శనమివ్వడం, విద్యుత్‌ నిలిచిపోవడం వంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం కళ్లు తెరవకపోవడంతో వరుస అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఖాద్రీశుడి రథోత్సవాన్ని వీక్షించేందుకు మూడు లక్షల మందికి హాజరుకాగా.. తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భక్తులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 

యథాస్థానానికి చేరిన రథం 
భక్తజన గోవింద నామస్మరణల మధ్య మంగళవారం ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం ఉదయాన్నే ఆలయ అర్చక బృందం తేరు ముందు బలిహరణం, ఆస్థాన పూజలు నిర్వహించింది. ఉదయం 8.25 నుంచి 8.45 గంటల మధ్య ముహూర్తం నిర్ణయించగా.. రథం 9.35 గంటలకు ముందుకు కదిలింది. ఓ వైపు ఎండ మండిపోతున్నా.. భక్తులు ఏమాత్రం లెక్కచేయకుండా స్వామివారి సేవలో తరించారు. తమ ఇలవేల్పును దర్శించుకుని రథంపైకి దవణం, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం 3.08 గంటలకు బ్రహ్మరథం యథాస్థానానికి చేరుకుంది.  

క్షతగాత్రుల వివరాలివీ.. 
ఈ ఘటనలో కదిరిలోని గజ్జలరెడ్డిపల్లికి చెందిన జయశేఖర్, ఆంజనేయులు, నల్లచెరువు మండలం దిగువపల్లికి చెందిన వెంకటేశు, గోరంట్ల మండలం కొండాపురానికి చెందిన రామాంజనేయులు, నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన అంజనీకుమార్, బుక్కపట్నం మండలం గసికవారిపల్లికి చెందిన సాయికుమార్‌ గాయపడ్డారు. వీరందరికీ కాళ్లు విరగడంతో నరకం చూశారు. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. తీవ్రంగా గాయపడిన జయశేఖర్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)