Breaking News

స్నేహంతో ‘వల’.. ఆపై వేధింపుల ‘సెగ’..!

Published on Sat, 04/12/2025 - 05:10

విశాఖ సిటీ: ‘నేను చేస్తున్నట్లే... నాకూ న్యూడ్‌ కాల్‌ చెయ్యాలంటే ఎంత కావాలో చెప్పు.. నమ్మకం లేక­పో­తే అకౌంట్‌ నంబర్‌ పెట్టు.. వెంటనే డబ్బులు పంపిస్తా’.. అంటూ ఓ గృహిణిని వేధింపులకు గురి చేసిన అనంతపురం కీచక జైలర్‌ సుబ్బారెడ్డి వ్యవ­హారం సంచలనంగా మారింది. అరెస్టుకు ప్ర­య­త్ని­స్తే, అప్పటికే నిందితుడు ముందస్తు బెయిల్‌ పొందాడు. 

ఈ ఉదంతంపై పోలీసుల వివ­రాల ప్రకారం, పార్వతీపురం మన్యం జిల్లాలో నివా­స­ముంటున్న గృహిణి ఫేస్‌బుక్‌ అకౌంట్‌కు కొన్నాళ్ల క్రితం జైలర్‌ సుబ్బారెడ్డి నుంచి ఒక ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. తాను జైలర్‌గా పనిచేస్తున్నట్లు పరి­చ­యం చేసు­కున్నాడు. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌కు అంగీకరించడంతో, స్నేహం పేరుతో చాటింగ్‌ ప్రారంభించా­డు. కొద్ది రోజులకు అసలు రంగును బయటపెట్టా­డు. న్యూ­డ్‌ కాల్స్, అసభ్య మెసేజ్‌లతో వేధించసాగాడు.  

మొదట ‘సారీ’.. ఆ తరువాత ‘కుక్క’ బుద్ధి..!
మహిళ భర్త, మరో బంధువు పోలీస్‌ శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్‌­లు, వేధింపుల వ్యవహారాన్ని మహిళ బంధువైన ఏసీపీకి, ఎస్‌ఐగా పనిచేస్తున్న భర్తకు చెప్పింది. దీంతో వారు జైలర్‌కు ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇచ్చారు. దీనిపై సదరు వ్యక్తి కేవలం ఫ్రెండ్‌షిప్‌ కోసమే మె­స్సేజ్‌లు పంపించానని, సారీ చెప్పాడు. కొన్నాళ్లు మెస్సేజ్‌లు పంపించడం మానేశాడు. మళ్లీ గత నెల 25వ తేదీ నుంచి మెస్సేజ్‌లు, కాల్స్‌ చేయడం ప్రారంభించాడు. 

వేధింపులను భరించలేక సదరు మహిళ విశాఖ పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. సీపీ వెంటనే   కేసును సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి,  జైలర్‌ను అరెస్టు చే­యడానికి అనంతపురం వెళ్లగా.. అప్పటికే పరార­య్యాడు.  విశాఖకు వచ్చి 5వ ఏడీజే (ఫ్యామిలీ) కోర్టులో ముందస్తు బెయిల్‌ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం విశాఖ పోలీసులను కలిసి ఆ ముందస్తు బెయిల్‌ పత్రాలను అందజేశాడు. 

శాఖాపరమైన చర్యలు..
కాగా, జైలర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవా­లని జైళ్ల శాఖ డీజీకి నగర పోలీస్‌ కమిషనర్‌ బాగ్చి లేఖ రాశారు. అలాగే ముందస్తు బెయిల్‌ రద్దుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.   

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)