Breaking News

కన్వర్షన్‌ చేయరు.. పదోన్నతులు ఇవ్వరు..

Published on Mon, 01/12/2026 - 05:02

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ బోర్డులో పోస్టుల మార్పుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పోస్టుల విభజన చేసిన ప్రభుత్వం కొన్ని పోస్టుల కన్వర్షన్‌పై ఎటూ తేల్చడం లేదు. దీంతో కమిషనరేట్‌ అధికారులు జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాళ్లకు ఎఫ్‌ఏసీ (పూర్తి అదనపు బాధ్యతలు) అప్పగిస్తున్నారు. అయితే ఈ విధానంలో తమకు అన్యాయం జరుగుతోందని సీనియర్లు ఆరోపిస్తున్నారు. పైరవీలు చేసుకున్న వారికే అధికారులు అవకాశం కల్పిస్తున్నారని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాకు ఒక్క అధికారే ఉండేలా..
ఉమ్మడి జిల్లాల్లో జిల్లా వొకేషన్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌(డీవీఈవో), డిప్యూటీ వొకేషన్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌/ ఏవో, ప్రాంతీయ ఇంటర్మీడియట్‌ అధికారి (ఆర్‌ఐవో) పోస్టులు ఉండేవి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత పోస్టుల రీ ఆర్గనైజేషన్‌ చేస్తూ జిల్లాకు ఒక్కరే అధికారి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో డీవీఈవో పోస్టును జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (డీఐ­ఈవో)గా మార్చారు. ప్రస్తుతం పాత జిల్లా­లకు డీఈవోలు ఉండగా, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఇన్‌చార్జిలే దిక్కుగా ఉన్నారు.

ఇదీ పరిస్థితి
రాష్ట్రంలో జిల్లాల విభజన తర్వాత ఇంటర్మీడియట్‌ బోర్డులో జిల్లా స్థాయి పోస్టు­లతో సహ ఉద్యోగులను జిల్లాలకు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో ఏవో/ డిప్యూటీ జిల్లా వొకేషనల్‌ ఎడ్యుకేషనల్‌ (డీఐఈవో) అధికారి పోస్టులను కొత్త జిల్లాలకు కేటాయించారు. దీంతో పాటు ఆ పోస్టులను జిల్లా వొకేషన్‌ ఎడ్యుకేషనల్‌ అధికారిగా మార్చాలని (కన్వర్షన్‌) అధికారులు ప్రభుత్వానికి, ఆర్థిక­శాఖకు ఫైల్‌ పంపారు.

దీనిపై ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకో­లేదు. అలాగే, జిల్లా వొకేషన్‌ ఎడ్యుకేషనల్‌ అధికారి పోస్టు పేరు ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీ­సర్‌గా మార్పుచేశారు. దీంతో పాత జిల్లాల్లోని డీవీఈవోలు డీఐఈవోలుగా బాధ్యతలు నిర్వర్తి­స్తుండగా, కొత్త జిల్లాలకు మాత్రం జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాళ్లకు డీఐఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వీరు తమ కాలేజీ నిర్వహణతో పాటు జిల్లా బాధ్యతలు కూడా చూస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)