Breaking News

ప్రభుత్వ కర్కశత్వంపై అక్షర గర్జన

Published on Fri, 06/13/2025 - 05:17

విజయవాడ స్పోర్ట్స్‌/జి.కొండూరు: ‘సాక్షి’ కార్యా­ల­యాలపై టీడీపీ నాయకులు, కార్య­కర్తలు దురుద్దేశంతో చేస్తున్న దాడులను ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, వామపక్ష నాయకులు, సీనియర్‌ జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. నాణేనికి మరోవైపు ఉన్న ప్రపంచాన్ని చూపిస్తూ ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షిపై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. పత్రిక కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని నినదించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను రెడ్‌బుక్‌ ప్రమాదంలో పడేసిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సాక్షి కార్యాలయాలపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడులకు నిరసనగా విజయవాడ గాం«దీనగర్‌లోని ధర్నా చౌక్‌ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఇచి్చన పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి జర్నలిస్టు, జర్న­లిస్టు సంఘాల నాయకులు తరలివచ్చి ధరా­లో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా కొనసాగింది.

టీడీపీ గూండాల చర్యలకు నిరసనగా ఫ్లకార్డులను ప్రదర్శించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి, రెడ్‌బుక్‌ పాలనను అంతం చేయండి, పత్రికా కార్యాలయాలపై దాడులు సిగ్గు.. సిగ్గు.. అనే నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయ­వాది ఒగ్గు గవాస్కర్, సాక్షి ప్రతినిధులు బీవీ రాఘవరెడ్డి, విశ్వనా«థ్‌రెడ్డి, ఎన్‌.సతీ‹Ù, ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, చందు శివాంజనేయులు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్ర పాల్గొన్నారు.

సాక్షిపై కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం 
మీడియా సంస్థలు తప్పులు, పొరపాట్లు చేశాయని భావిస్తే ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం సమంజసం కాదు. ఇది కేవలం కక్షసాధింపు చర్యే. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను ఈ ప్రభుత్వం దురి్వనియోగం చేస్తోంది. సాక్షిపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం. 
– కె.పోలారి, ఇఫ్టూ నేత

నా సర్విసులో ఇలాంటివి చూడలేదు 
నా సర్విసులో మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ఇటువంటి దాడులు చూడలేదు. మీడియా సంస్థలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇటు­వంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. 
– వెంకటేశ్వరరెడ్డి, రిటైర్డ్‌ పోలీసు అధికారి 

నిరంకుశ చర్య మంచిది కాదు 
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులను, దమన కాండలను జర్నలిస్టు సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం దుర్మార్గం. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి ప్రదర్శించడంమంచి చర్య కాదు. – సీహెచ్‌.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి, చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం (సామ్నా) 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)