Breaking News

పాప ప్రక్షాళనకే శ్రీవారికి నా ఆస్తి రాసిచ్చా

Published on Sun, 12/07/2025 - 04:28

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగానే తన ఆస్తిని తిరుమల శ్రీవారికి రాసిచ్చానే తప్ప.. మరెవ్వరికీ రాసివ్వలేదని పరకామణి కేసులోని ప్రధాన నిందితుడు రవికుమార్‌ స్పష్టంచేశారు. టీటీడీ పరకా­మ­ణిలో చోరీకి పాల్పడ్డ రవికుమార్‌.. ప్రాయశ్చి­త్త­ంతో తన ఆస్తిని శ్రీవారికి రాసిచ్చిన విషయం తెలి­సిందే. మూసివేసిన కేసును చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరకామణి కేసును తిరగతోడి వైఎ­స్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా విచారణ చేపట్టింది. 

రాజకీయ ప్రయోజనాల కోసం ఎల్లో మీడియా ద్వారా టీడీపీ కూటమికి అనుకూలంగా ప్రచా­రాలు చేస్తూ పరకామణి కేసును తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రవికుమార్‌ శనివారం సెల్ఫీ వీ­డియో విడుదల చే­శారు. అందులో.. ‘నేను చేసిన పాపానికి ప్రా­య­శ్చి­త్తంగా శ్రీవారికి నా ఆస్తినంతా రాసిచ్చాను, శ్రీవారికి కాక ఇంకెవరికి రాస్తాను?’.. అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..

నాపై చెప్పేవన్నీ అబద్ధాలే..
అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్‌. నేను కొంతకాలంగా పెద్దజీయర్‌ మఠంలో గుమస్తాగా పనిచేస్తున్నా. కేబుల్, రియల్‌ ఎస్టేట్‌ వ్యా­పారం కూడా చేస్తున్నా. రెండేళ్ల క్రితం అంటే.. 2023 ఏప్రిల్‌ 29న పరకామణిలో ఓ తప్పు చేశా­ను. దానిని నేను, మా కుటుంబం మొత్తం మహా పాపంగా భావించి పాప పరిహారార్థం నా ఆస్తిలో­ని 90 శాతం స్వామివారికి రాసిచ్చాను. కానీ, కొంతమంది దీనిని మరోలా భావించి, ఇంకోలా మా­ట్లాడుతున్నారు. 

కొందరికి డబ్బులిచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని.. కొందరి ఒత్తిళ్లతో ఇదంతా చేశానంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నా ఆస్తి­ని శ్రీవారికి కాకుండా ఎవరికో ఎందుకిస్తాను చె­ప్పండి. కొంతమంది నన్ను బ్లాక్‌ మెయిల్‌ కూడా చేశారు. అలా చేసిన వారిపై కేసులు పెట్టాను. నా శరీరంలోని ఓ ప్రైవేటు పా­ర్టుకు శస్త్రచికిత్స చేసుకు­న్నానని అసభ్యకరంగా మాట్లాడారు. 

పైగా.. వా­టి­పై డిబేట్లు పెట్టడం, మా గురించి అసభ్యకరంగా మాట్లాడడం చేస్తున్నారు. దీంతో.. రెండున్నరేళ్లుగా నేను, నా కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదన చెందుతున్నాం. ఈ విషయాలపై కోర్టు కలుగచేసుకుంటే.. నేను ఎలా­ంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. నేను ఎలాంటి శస్త్ర చికిత్సలు చేసుకోలేదని నిరూపించుకుంటా. వీళ్లు నాపై చెప్పేవన్నీ అబద్ధా­లే. నేను ఎంత మహాపాపం చేశానో తలచుకుని తలచుకుని బాధపడని రోజంటూలేదు. దయచేసి ప్లీజ్‌.. అంటూ రెండు చేతులు జోడించి రవికుమార్‌ కన్నీటితో వేడుకున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)