Breaking News

ఆర్జీయూకేటీ యోగా జట్ల ఎంపిక

Published on Mon, 11/04/2024 - 05:36

నూజివీడు: జాతీయ స్థాయి అంతర్‌ విశ్వవిద్యాలయాల యోగా పోటీల్లో పాల్గొనే ఆర్జీయూకేటీ జట్లను ఆదివారం నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎంపిక పోటీల్లో నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు చెందిన యోగా క్రీడాకారులు పాల్గొన్నారు. 

ఈ పోటీలను ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌ ప్రారంభించారు. టీం ఈవెంట్, వ్యక్తిగత, రిథమిక్, ఆర్టిస్టిక్‌ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని ఆర్జీయూకేటీ జట్లకు ఎంపిక చేశారు. వీరు డిసెంబర్‌ 24 నుంచి 27 వరకు భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా రాజమహేంద్రవరం శాప్‌ యోగా కోచ్‌ నాగేంద్రన్‌ వ్యవహరించారు. 

ఎంపికైన విద్యార్థులు..  
మహిళల విభాగంలో టీం ఈవెంట్‌ జట్టుకు ఏవీఎల్‌ నిఖిల, ఎస్‌.ప్రమీల, ఎ.అనూష, సీహెచ్‌ దివ్య, జేహెచ్‌వీఎస్‌ దుర్గ, సీహెచ్‌ మేఘశ్రీ, వ్యక్తిగత విభాగంలో ఎ.అశ్విత, ఆర్టిస్టిక్‌ విభాగంలో పి.మేఘన, రిథమిక్‌ విభాగంలో బి.హేమ ఎంపికయ్యారు. పురుషుల జట్టులో టీం ఈవెంట్‌కు కె.లక్ష్మణరావు, ఆర్‌.శేషసురేష్, పి.ఆదిశంకర్‌రెడ్డి, టి.అభిషేక్, టి.అశోక్, పి.సాయిసురే‹Ù, వ్యక్తిగత విభాగంలో పి.భరత్‌కు­మార్, ఆర్టిస్టిక్‌ విభాగంలో ఆర్‌.సాయిచైతన్య, రిథమిక్‌ విభా­గంలో టి.దుర్గాప్రసాద్‌ ఎంపికయ్యారు. వీరంతా నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి చెందినవారే కావడం గమనార్హం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)