Breaking News

మాజీ సీఎం నివాసం వద్ద భద్రతా లోపం

Published on Tue, 01/20/2026 - 04:18

తాడేపల్లి రూరల్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద ప్రభుత్వ భద్రతా లోపం మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద నిత్యం భద్రతను పర్యవేక్షిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నా... ఆ ప్రాంతంలో దొంగలు చెలరేగి­పోతున్నారు. రోడ్డు వెంబడి ఉన్న ఫుట్‌పాత్‌ లైట్లు, ఐరన్‌ గ్రిల్స్‌ను కట్‌ చేసి తీసుకువెళుతున్నా పోలీసులు గుర్తించలేకపోతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని భరతమాత సెంటర్‌ నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం మీదుగా ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీమ్‌ వరకు రహదారికి ఇరువైపులా మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొ­­రేషన్‌ నిధులతో గతంలో రోడ్డు నిర్మించారు. 

రహ­దారి ఫుట్‌పాత్‌ వెంబడి లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ లైట్లకు భద్రత కోసం డిజైన్‌ కలిగిన ఐరన్‌ గ్రిల్స్‌ను పెట్టారు. కొద్దిరోజులుగా గ్రిల్స్‌ సహా లైట్లను వచ్చినంత వరకు దొంగలు కట్‌ చేసి తీసుకెళ్లిపోతున్నారు. కొన్నిచోట్ల విద్యుత్‌ తీగలను ఫుట్‌పాత్‌పై వదిలివేయడంతో ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. పొరపాటున విద్యుత్‌ సరఫరా అయితే ఫుట్‌పాత్‌పై ప్రయాణించే వారితోపాటు ఉదయం సాయంత్రం వాకింగ్‌ చేసేవారికి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దర్జాగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి దొంగిలిస్తుంటే కార్పొరేషన్‌ అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)