Breaking News

పల్నాడులో 144 సెక్షన్‌ ముగిసింది

Published on Sat, 06/08/2024 - 05:35

సాక్షి, నరసరావుపేట: ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో విధించిన 144 సెక్షన్‌ అమలు ముగిసిందని కలెక్టర్‌ శ్రీకేశ్‌ బి. లత్కర్‌ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఎస్పీ మలికా గార్గ్, జేసీ శ్యాంప్రసాద్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో 28 రోజులు 144 సెక్షన్‌ అమలు చేశామని, శాంతి భద్రతలు అదుపులోకి రావడంతో ఆ నిబంధన ఎత్తేశామని చెప్పారు. 

ర్యాలీలు, సమావేశాలకు మాత్రం పోలీసుల అనుమతి తప్పనిసరి అని అన్నారు. కౌంటింగ్‌ తరువాత జిల్లాలో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా మళ్లీ ఆంక్షలు విధిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్‌ సమయంలో గొడవలతో జిల్లాకు మచ్చ పడినప్పటికి,  కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగి జిల్లాకు తిరిగి మంచిపేరు వచ్చిందన్నారు. 

రాష్ట్రంలో ప్రశాంతంగా కౌంటింగ్‌ ముగిసిన జిల్లాల్లో పల్నాడు ముందుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర  సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియలో 13,739 మంది సిబ్బంది, కౌంటింగ్‌లో 2,136 మంది పాల్గొన్నారన్నారు. ముఖ్యంగా జిల్లాలో 86.5 శాతం ఓటింగ్‌ నమోదు చేసిన ఓటర్లను ప్రత్యేకంగా అభినందించారు.



దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ మలికా గార్గ్‌ 
కౌంటింగ్‌ ముగిసిన తరువాత జిల్లాలో అక్కడక్కడా గొడవలు జరుగుతున్నాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ హెచ్చరించారు. గత రెండు రోజుల్లో గొడవలకు దిగిన వారిపై 46 కేసులు నమోదు చేసి, 140 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. ప్రభుత్వ భవానాలపై రంగులు, విగ్రహాలు నచ్చకపోతే స్థానిక సంస్థలలో తీర్మానాలు చేసి అధికారికంగా మార్చాలని, చట్టాలను చేతుల్లోకి తీసుకోరాదన్నారు. 

సమస్యాత్మక గ్రామాలలో పోలీస్‌ పెట్రోలింగ్‌ కొనసాగుతుందని చెప్పారు. గ్రామాలలో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి గొడవలు జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలింగ్‌ సమయంలో జిల్లాలో 168 కేసులు నమోదు చేసి 1,338 మందిని అరెస్ట్‌ చేశామని, త్వరలో ఛార్జిïÙట్‌లు వేసి తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)